Anupama Parameshwaran : ఈ కుర్రాడు మరో హిట్ కొట్టేలానే ఉన్నాడే

Anupama Parameshwaran :  ఈ కుర్రాడు మరో హిట్ కొట్టేలానే ఉన్నాడే
X

కోలీవుడ్ లో యూత్ ఫుల్ మూవీస్ కు మీనింగ్ సెపరేట్ గా ఉంటుంది. యూత్ ఫుల్ అనగానే బూతుల్ అని భావించే ఆడియన్స్ ఉన్న కాలంలో వాళ్లు కాస్త కొత్తగా ఆలోచిస్తారు అనేందుకు చాలా సినిమాలే ఉదాహరణలుగా ఉన్నాయి. అఫ్ కోర్స్ తెలుగులోనూ అలాంటి మూవీస్ ఉన్నాయి. బట్ సంఖ్యా పరంగా కాస్త తక్కువ. కొన్నాళ్ల క్రితం తనకు హీరెలెవరూ దొరక్కపోతే తనే హీరోగా మారి లవ్ టుడే అనే మూవీతో వచ్చాడు ప్రదీప్ రంగనాథన్ అనే దర్శక, హీరో. కుర్రాడు మరీ యంగ్ అనుకున్నారేమో మొదట ఎవరూ నమ్మలేదు. బట్ లవ్ టుడే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో డబ్ అయితే ఇక్కడి యూత్ ను కూడా బాగా ఆకట్టుకుందీ మూవీ. దర్శకుడుగా ఉంటే చాలు అనుకున్న అతను ఇప్పుడు హీరోగా బిజీ అయిపోయాడు. డ్రాగన్ అనే మూవీతో త్వరలోనే వస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఇక్కడ అతనికి ప్లస్ పాయింట్ గా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఉంది. కయాడు లోహర్ మరో హీరోయిన్ గా నటించింది.

ఓ మై కడవులే అనే చిత్రంలో సూపర్ హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు డ్రాగన్ కు దర్శకుడు. లవ్, లవర్స్ మధ్య ఉండే ఎమోషన్స్, పెయిన్, రొమాన్స్, కన్ఫ్యూజన్స్ ను ఈ దర్శకుడు బాగా హ్యాండిల్ చేస్తాడు అనే పేరుంది. అది నిజమే అని ఈ డ్రాగన్ ట్రైలర్(తెలుగులోనూ ఉంది) చూస్తే తెలుస్తుంది. కాలేజ్ డేస్ లో బాధ్యతారహితంగా ఉండి మొత్తం సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన కుర్రాడు.. కాలేజ్ లో ఓ అమ్మాయితో ప్రేమలో పడటం.. ఇతను ఫెయిల్యూర్ అని ఆమె వదిలేస్తే తర్వాత మరో అమ్మాయి అతని లైఫ్ లోకి రావడం.. తనూ వదిలేయడం.. అసలు అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన అబ్బాయి జీవితంలో ఏం సాధించాడు అనే కోణంలో సాగే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీతో తెలుగులోనూ మరో విజయం అందుకునేలానే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ముగ్గురు దర్శకులు కూడా నటించడం విశేషం. కేఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్, మిస్కిన్ వంటి వాళ్లు కీలకమైన పాత్రల్లోనే కనిపిస్తున్నారు.

Tags

Next Story