Dream Girl 2 first look: అందానికే అసూయ తెప్పిస్తోన్న ఆయుష్మాన్
'డ్రీమ్ గర్ల్ ౨' నిజానికి ఆయుష్మాన్ ఖురానా సినిమాల్లోనే అత్యంత ఆకట్టుకునే చిత్రాలలో ఒకటిగా నిలవనున్నట్టు తెలుస్తోంది. భావోద్వేగాల మిశ్రమంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కారణం తాజాగా రిలీజైన ఆయుష్మాన్ ఖురానా లుక్కే. పూజా పాత్రలో ఆయన కనిపిస్తోన్న తీరు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక లేటెస్ట్ గా రివీల్ అయిన ఈ పోస్టర్ ను గమనిస్తే.. ఓ వైపు ఖురానా సాధారణంగానే కనిపిస్తూనే చేతిలో మాత్రం లిప్ స్టిక్ తో కనిపించాడు. ఎదురుగానే మళ్లీ స్ర్త్రీ వేషంలో ఉన్న ఖురానా ముఖ్యంగా అందర్నీ ఆకట్టుకుంటోంది.
అంతకుముందు రివీల్ చేసిన 'డ్రీమ్ గర్ల్ 2' ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇందులో ఆయుష్మాన్.. నీలి రంగు టీ షర్టులో కర్టెన్ వెనుక నుండి చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ తెర వెనుక అతని నీడ మాత్రం స్త్రీని పోలినట్టుగా కనిపిస్తుంది. పొడవాటి జుట్టు, చేతులకు గాజులు, నాజుకైన నడుము ఈ నీడలో కనిపించడం... సినిమాపై మరింత క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ఖురానా ఈ చిత్రంలో కరమ్, పూజ అనే రెండు విభిన్న పాత్రలను పోషించనున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు దానిపై 'కమింగ్ సూన్' అని రాసి ఉంచారు. వీటితో పాటు ఓ కిస్ సింబల్.. దాని పక్కనే "@పూజా___డ్రీమ్‌గర్ల్ కమింగ్ సూన్!" అని రాసుకొచ్చారు. ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో కనిపించనున్న డ్రీమ్ గర్ల్ 2 అనేది 2019లో వచ్చిన సూపర్‌హిట్ రొమాంటిక్ కామెడీ డ్రీమ్ గర్ల్‌కి సీక్వెల్. ఈ చిత్రంలో అన్నూ కపూర్, పరేష్ రావల్, విజయ్ రాజ్, అస్రానీ, మంజోత్ సింగ్ వంటి స్టార్స్ కూడా వివిధ పాత్రల్లో అలరించనున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.
ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన 'డ్రీమ్ గర్ల్ 2'లోని ఆయుష్మాన్ ఖురానా ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సీక్వెల్‌ను చూసేందుకు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. ఈ లుక్ తో తెగ సంబరపడుతున్నారు. పూజా పాత్రలో ఆయుష్మాన్ వ్యవహారశైలిపై స్పందిస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి గెటప్‌లో ఆయుష్మాన్ లుక్‌ని చూసి చాలా ఇష్టపడుతున్నారు. అతను నిజమైన అమ్మాయిల కంటే అందంగా కనిపిస్తున్నాడని కొందరు భావిస్తున్నారు. ఓ అమ్మాయి ప్రవర్తన, నడవడికను ఎలా అలవర్చుకున్నాడు అని ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com