Dream Girl 2 : స్టార్ హీరోల మధ్య చిన్న సినిమా..!

Dream Girl 2 : స్టార్ హీరోల మధ్య చిన్న సినిమా..!
X
బాలీవుడ్ బడా స్టార్ ల సినిమాల మధ్యలో దుమ్ము దులుపుతున్న చిన్న హీరో సినిమా కలెక్షన్స్.

‘మంచి సినిమాలు రావట్లేదు అని కంప్లైంట్ చేసే ముందు.. అలాంటి సినిమాలొచ్చినప్పుడు ఆదరించడం కూడా అలవాటు చేసుకోవాలి’ అని సినీ విశ్లేషకులు అంటుంటారు. కొన్నిసార్లు చిన్న సినిమానే కదా అని చిన్న చూపు చూసిన చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో మూవీ ఇలాగే డే వన్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి, ఆ మాటను మరోసారి నిజం చేసింది. టాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా గురించి ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. 2019లో ఆయుష్మాన్, రాజ్ శాండిల్య కాంబోలో.. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద ఏక్తా కపూర్, శోభా కపూర్ ప్రొడ్యూస్ చేసిన కామెడీ డ్రామా ఫిలిం ‘డ్రీమ్ గర్ల్’.. దీనికి సీక్వెల్‌గా అదే హీరో, దర్శక నిర్మాతల కలయికలో వచ్చిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ శుక్రవారం (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకొచ్చింది.


అనన్య పాండే హీరోయిన్. పరేష్ రావెల్, అన్ను కపూర్, రాజ్ పాల్ యాదవ్, విజయ్ రాజ్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఆయుష్మాన్.. పూజా/కరమ్ సింగ్ అనే డిఫరెంట్ డ్యుయెల్ రోల్ చేశాడు. తన జీవితంలో ఎదురైన ఊహించని పరిస్థితుల కారణంగా ఓ మిడిల్ క్లాస్ యువకుడు, యువతిగా మారడం అనే పాయింట్‌ని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఫన్నీగా చూపించి ఆడియన్స్‌ని అలరించడంలో సక్సెస్ అయ్యారు టీం. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆయుష్మాన్ పర్ఫార్మెన్స్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. అలాగే మొదటి రోజు తనలాంటి యంగ్ హీరో రేంజ్‌కి తగ్గట్టుగానే వచ్చాయి. డే 1 ఇండియాలోనే రూ. 9.70 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల వారి అంచనా.


అలాగే పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ వంటి మల్టీ‌ప్లెక్సుల్లో భారీస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమా ఫస్ట్ డే వసూళ్లలో దాదాపు 60 శాతం కలెక్షన్స్ ఈ మల్టీప్లెక్స్ నుంచే వచ్చాయి. రూ. 5.35 కోట్లు వీటి ద్వారానే రావడం విశేషం. ఓ వైపు సన్నీ డియోల్ ‘గదర్ 2’, రజినీ కాంత్ ‘జైలర్’ వంటి సినిమాలు సత్తా చాటుతుండగా.. అక్షయ్ కుమార్ ఓ మోస్తరు కలెక్షన్లతో రన్ అవుతుంది. అలాంటి బిగ్ స్టార్స్ సినిమాల టైంలో వచ్చిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఇలాంటి వసూళ్లు రాబట్టిందంటే ఆయుష్మాన్ రేంజ్‌కది గ్రేట్ అనే చెప్పాలి. ఈ వీకెండ్ కలెక్షన్స్ మరికాస్త పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు

Tags

Next Story