Venkatesh : దృశ్యం3 .. తెలుగులో ఉంటుందా..? ఉండదా..?

దృశ్యం, దృశ్యం2తో సూపర్ హిట్స్ అందుకున్నాడు మోహన్ లాల్. అతని తర్వాత రీమేక్స్ తో బాగా ఆకట్టుకున్నాడు వెంకటేష్. అఫ్ కోర్స్ ఈ మూవీ ఇతర అనేక భాషల్లో రీమేక్ అయింది. బట్ తెలుగులోనే బాగా వర్కవుట్ అయింది. మరి దృశ్యం3 పరిస్థితి ఏంటీ అనేది మాత్రం క్వశ్చన్ లో పడిపోయింది. ముఖ్యంగా తెలుగులో. ప్రస్తుతం వెంకటేష్ ఆదర్శ కుటుంబం అనే మూవీ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కామెడీతో పాటు యాక్షన్ కు కూడా బాగా స్పేస్ ఉంటుంది అని టైటిల్ లోనే చెప్పారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్ దృశ్యం3 చేయడానికి రెడీ అవుతాడు అనుకున్నారు. బట్ అతను ఈ మూవీలో నటించబోవడం లేదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.
ప్రస్తుతం వెంకటేష్.. ఆదర్శ కుటుంబం మూవీపై పూర్తిగా ఫోకస్ చేశాడు. తర్వాత అనిల్ రావిపూడితో మూవీకి సిద్ధం అవుతాడట. అనిల్ రావిపూడితో అతనికి మంచి కెమిస్ట్రీ కూడా సెట్ అయింది. అందుకే ఈ మూవీకే ఎక్కువ ప్రఫర్ చేస్తున్నాడు వెంకీ. ఈ కారణంతోనే దృశ్యం3 ని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాడు అని చెబుతున్నారు. మరి నిజంగా దృశ్యం3 ను వెంకటేష్ వదులుకున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
