టాలీవుడ్, శాండల్‌వుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ ప్రకంపనలు
సుశాంత్ మృతితో రిలేటెడ్‌గా బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు... టాలీవుడ్, శాండల్‌వుడ్‌నూ షేక్ చేస్తున్నాయి. తాజాగా.. డ్రగ్స్ ఎంక్వైరీ ఎపిసోడ్‌లో ప్రముఖ నటి రుకల్ ప్రీత్ సింగ్ నేడు NCB విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్ చెబుతోంది. నార్కోటిక్స్ అధికారుల విచారణలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రముఖ తారలు... రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకునే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్‌కు సమన్లు జారీ అయ్యాయి. అందులో భాగంగానే... నేడు రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ మేనేజర్ శ్రుతీ మోదీ, డిజైనర్ సిమోన్ ఖంబట్టాను NCB అధికారులు విచారణకు పిలిచారు.
డ్రగ్స్ విచారణలో భాగంగా... రేపు దీపికా పదుకునె, శనివారం సారా అలీఖాన్, శ్రద్దా కపూర్‌లు NCB అధికారుల విచారణకు హాజరుకావాల్సి ఉంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వెల్లడించిన వివరాల మేరకు టాలెంట్ సంస్థ మేనేజర్ జయా సాహాను విచారించగా... పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అటు నిర్మాత మధు మంతెన స్టేట్‌మెంట్‌ను అధికారులు నిన్న రికార్డు చేశారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించామని.. అయితే.. అనారోగ్య కారణాల వల్ల ఆమె కొంత సమయం అడిగినట్లు అధికారులు తెలిపారు. కరిష్మా వాట్సాప్ సంభాషణల్లో.. .D అనే వ్యక్తి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్టు వెల్లడైందని... ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటామని అధికారులు అంటున్నారు.
రియా బెయిల్ పిటిషన్ ఇవాళ బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నది వాస్తవమేనని... తాను అమాయకురాలినని.. బెయిల్ పిటిషన్‌లో రియా పేర్కొంది. ఇంకా తాను.. ED, సీబీఐ, పోలీసుల విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉందని తెలిపింది. ఇకపై జరిగే విచారణలో తన మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. అటు...దీపికా పదుకునే గతంలో తన స్నేహితులకు ఇచ్చిన పార్టీపై అందరి దృష్టిపడింది. బాంద్రాలోని అత్యంత విలావసవంతమైన కోకోబార్ అండ్ రెస్టారెండ్‌లో 2017లో దీపిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో అనేక మంది బాలీవుడ్ నటులు హాజరయ్యారు. వారంతా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో... డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నాయో వెతికే పనిలో NCB అధికారులు బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, అమృత్‌సర్ సహా వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనేదానిపై దృష్టిపెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్‌ను NCB విచారణకు పిలవడంతో.. టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్స్ కేసు రుకుల్‌తోనే ఆగుతుందా.. .ఇంకా కొత్తగా ఇతరుల పేర్లు తెరపకి వస్తాయన్న టెన్షన్ నెలకొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com