Dulquer Salmaan: తండ్రి సూపర్ స్టార్.. 'దుల్కర్‌' కు ఎంత వరకు కలిసొచ్చింది..

Dulquer Salmaan: తండ్రి సూపర్ స్టార్.. దుల్కర్‌ కు ఎంత వరకు కలిసొచ్చింది..
Dulquer Salmaan: సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుందేమో కానీ అతడిలో పస లేకపోతే వెనకా ముందూ చూడకుండా ఇంటికి పంపించేస్తారు ఆడియన్స్..

Dulquer Salmaan : సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుందేమో కానీ అతడిలో పస లేకపోతే వెనకా ముందూ చూడకుండా ఇంటికి పంపించేస్తారు ఆడియన్స్.. స్టార్ హీరోలందరి పిల్లలు టాప్ పొజిషన్‌లో ఉంటారని అనుకోవడానికి లేదు.. యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి.. దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. అదే దుల్కర్ సల్మాన్‌కి కూడా ఎదురైన ప్రశ్న. మహానటితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఇప్పుడు సీతారామం అంటూ మరోసారి మనముందుకు వచ్చాడు.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దుల్కర్ నటనను ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు.

దుల్కర్ సల్మాన్ ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు. సూపర్‌స్టార్ కొడుకు కావడం వల్ల అది తన కెరీర్‌ని ఏ విధంగా ప్రభావితం చేసిందో దుల్కర్ చెప్పుకొచ్చాడు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్ కలిసి నటించిన దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు.

ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి వ్యాఖ్యానిస్తూ..

మమ్ముట్టి పలు భాషల్లో చిత్రాల్లో నటించడమే కాకుండా వాటిని నిర్మించారు. మమ్ముట్టి భారతీయ సినిమా ప్రపంచానికి చేసిన కృషికి దేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన పద్మభూషణ్ అతడిని వరించింది. సహజంగానే, తండ్రి సూపర్ స్టార్ కావడంతో కొడుకు దుల్కర్ సల్మాన్ కెరీర్‌కి ఏమైనా సహాయం పడిందా అని అడిగారు. మమ్ముట్టి కెరీర్ 5 దశాబ్దాలుగా విస్తరించి ఉంది. "నేను నా స్వంత గుర్తింపు కోసం పనిచేశాను". చాలా విషయాలను నా తండ్రి నుంచే కాక, ఇతర నటీనటులను చూసి నేర్చుకున్నాను.

పాన్-ఇండియా పదంపై దుల్కర్ సల్మాన్

ఇదే ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా అనే పదం వాడుకపై స్పందించారు. పదం చుట్టూ కొనసాగుతున్న క్రేజ్ గురించి అడిగారు. పాన్-ఇండియా అనే పదం గురించి దుల్కర్‌కు ప్రత్యేకమైన దృక్కోణం ఉంది. ఈ పదాన్ని ఇప్పుడు అతిగా వాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అమితాబ్ బచ్చా, రజనీకాంత్ , చిరంజీవి , నాగార్జున అక్కినేని ఇంకా అనేక మంది తారలు ఇప్పటికే చాలా కాలం క్రితమే సరిహద్దులను దాటి మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు దీనిని కొత్త కాన్సెప్ట్‌గా చూడలేము అని అన్నారు. అయితే, వినోద పరిశ్రమను ఒక పరిశ్రమగా ప్రజలు చూడటం సానుకూల మార్పు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

సీతా రామం ఆగష్టు 5, 2022 న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.

Tags

Read MoreRead Less
Next Story