Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ మరో మూవీ మొదలుపెట్టాడు

Dulquer Salmaan :  దుల్కర్ సల్మాన్ మరో మూవీ మొదలుపెట్టాడు
X

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ నాన్ స్టాప్ గా దూసుకుపోతున్నాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమా అంటే కొత్త కంటెంట్ గ్యారెంటీ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అతని స్క్రిప్ట్ సెలెక్షన్ ఆ రేంజ్ ల ఉంటోంది. తను స్టార్డమ్ కోసం చూడటం లేదు. కథల్లో స్టార్డమ్ ఉందా లేదా అని చూసుకుంటున్నాడు. అందుకే అన్ని వైవిధ్యమైన కథలు.. అంత సక్సెస్ రేట్. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార, కాంత చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు తెలుగు సినిమాల తర్వాత తాజాగా మరో తెలుగు మూవీ స్టార్ట్ అయింది.

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో ఈ మూవీ స్టార్ట్ అయింది. రవి నేలకుడితి అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. అతను గతంలో పరశురామ్ వద్ద పనిచేశాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇక నానికి, దుల్కర్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే అతని ప్రతి సినిమాకూ నాని ఏదో రకంగా అటెండ్ అవుతుంటాడు. ఈ మూవీకీ అంతే. నానితో పాటు శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సనా కూడా ఈ ఓపెనింగ్ కు హాజరయ్యారు.

ఇక ఈ మూవీ ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటున్నారు. లవ్ స్టోరీస్ లో ఫీల్ ఉంటే ఆడియన్స్ ఫ్యాన్ అయిపోతారు. సో.. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోందో చూడాలి.

Tags

Next Story