King of Kotha Trailer : యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ తో వచ్చిన దుల్కర్ సల్మాన్

ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కోథా' రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు అభిలాష్ జోషి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓనం పండుగ సెలవుల్లో అంటే ఆగస్టు 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా కింగ్ ఆఫ్ కోతాలో దుల్కర్ సల్మాన్ తో పాటు ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా రిలీజైన 'కింగ్ ఆఫ్ కోథా' ట్రైలర్‌ను స్టార్ నటులు షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, సూర్య, నాగార్జున కలిసి విడుదల చేశారు. 'కింగ్ ఆఫ్ కోథా' అనేది ఎక్సాట్రార్డినరీ జర్నీ. ఈ సినిమాను ప్రత్యేకంగా రిచ్ క్యారెక్టర్స్, క్లిష్టమైన కథనం, గ్రాండ్ ప్రొడక్షన్ స్కేల్ నిలబెట్టాయి. మొదటిసారిగా జీ స్టూడియోస్‌తో కలిసి పని చేయడం ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇది వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. ఇది నాకు సంతోషకరమైన ప్రయాణం లాంటిది. ఇది నా ప్రేక్షకులకు ఓనమ్ ట్రీట్" అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు.
“‘కింగ్ ఆఫ్ కోథా’ని ఈ ఓనమ్‌కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఆకట్టుకునే కథనంతో పాటు భారీ నిర్మాణ స్థాయి వీక్షకులను ఆకర్షించే సినిమాటిక్ అనుభవాన్ని ఈ మూవీ ఇస్తుంది. ఇది మరపురాని ప్రయాణం. ఈ విజన్‌కి జీవం పోయడానికి వేఫేరర్ ఫిల్మ్స్ కంటే మెరుగైన భాగస్వాములు ఎవరూ ఉండరనుకుంటున్నాం ” అని జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ అన్నారు.
కేరళకు చెందిన మలయాళం-భాషా చిత్ర పరిశ్రమ నుండి వచ్చినప్పటికీ, సల్మాన్ అనేక తెలుగు సినిమాల్లోనూ నటించి, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 'కురుప్' (2021), 'బెంగళూరు డేస్' (2014)తో సహా తమళంలో విజయం సాధించిన 'ఓ కాదల్ కన్మణి' (2015), హిందీలో వచ్చిన 'కార్వాన్' (2015)కి కూడా ఆయన ప్రసిద్ది చెందారు. 2022 లో విడుదలైన 'సీతా రామం' తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీ వెర్షన్‌లోనూ విజయవంతమైంది. ఆయన నటించిన చివరి విడుదల హిందీ భాషా బాలీవుడ్ చిత్రం 'చుప్' (2022).
Congratulations on the impressive #KOKTrailer , @dulQuer ! Looking forward to the movie. Big hug to you and wishing the entire team a big success!https://t.co/dcecymQhvV#KingOfKotha @dulQuer @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe…
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com