Dulquer Salman: మొన్న తండ్రికి, ఇప్పుడు కొడుక్కి.. ఎవరినీ వదలని కరోనా..

Dulquer Salman: కరోనా సినిమా పరిశ్రమను వదిలిపెట్టేటట్టు లేదు. ఈ మహమ్మారి బారిన పడిన సినీ సెలబ్రిటీల జాబితా అంతకంతకు పెరుగుతోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన కుమారుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు కూడా కరోనా సోకింది.
పాజిటివ్ అని తేలడంతో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొద్దిగా జలుబు ఉందని పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నానని, ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మధ్య కాలంలో షూటింగ్‌ల సమయంలో తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా లక్షణాలుంటే కరోనరీ డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
మహమ్మారి ఇంకా ముగియలేదు.. అందరూ మాస్క్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ దుల్కర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కేవలం వారం గ్యాప్‌లో తండ్రీ కొడుకులకు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో యువ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి'లో దుల్కర్ పోషించిన పాత్ర అతడిని తెలుగు ప్రేక్షకులను దగ్గర చేసింది.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com