Sai Pallavi : సాయి పల్లవితో దుల్కర్ రొమాన్స్

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా సౌత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఇంత క్రేజ్ ఉన్నా.. ఏ మాత్రం తొందర లేకుండా కేవలం కథలు నచ్చితేనే కమిట్ అవుతూ.. మంచి సినిమాలతో మెప్పిస్తోంది. లేటెస్ట్ గా అమరన్ తో మరోసారి తనలోని మంచి నటిని చూపించింది. ప్రస్తుతం తెలుగులో తండేల్ లో నాగ చైతన్య సరసన నటిస్తోంది. అటు బాలీవుడ్ రామాయణంలో సీత పాత్ర కోసం తననే అనుకుంటున్నారు. ఈ టైమ్ లో అమ్మడికి మరో మంచి అవకాశం వచ్చిందని టాక్.
సాయి పల్లవి కంటే ముందు నుంచే కేవలం కథలు నచ్చితేనే సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్నా.. ఆ ఇమేజ్ చట్రంలో ఆగిపోలేదు అతను. ప్రయోగాలు చేశాడు. క్లాస్ తో పాటు మాస్ నూ మెప్పిస్తున్నాడు. తాజాగా లక్కీ భాస్కర్ తో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాకు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకుడు. ఈ సినిమాకు ‘‘ఆకాశంలో ఒక తార’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ లోనే సాయి పల్లవిని తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ సాయి పల్లవి ఓకే చెప్పినట్టే అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.
దుల్కర్, సాయి పల్లవి కలిసి గతంలో మళయాలంలో ‘కాళి’అనే సినిమా చేశారు. ఇది అక్కడ పెద్ద విజయమే సాధించింది. అలాంటి జోడీ మరోసారి కలిసి నటించబోతున్నారంటే ఖచ్చితంగా తెలుగులో పెద్ద క్రేజ్ వస్తుందీ ప్రాజెక్ట్ కు. రొమాంటిక్ లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి.. ఈ జోడీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ నేచురల్ గా పండిస్తారు అని వేరే చెప్పక్కర్లేదేమో.. అంటే ఇద్దరూ ది బెస్ట్ యాక్టర్స్ కదా.. అందుకే అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com