Dulquer Salman's Katha : పోస్ట్ పోన్ కబురు చల్లగా చెప్పారే

Dulquer Salmans Katha :  పోస్ట్ పోన్ కబురు చల్లగా చెప్పారే
X

స్మాల్ మూవీస్ రిలీజ్ డేట్స్ గురించి జనం పెద్దగా పట్టించుకోరు. స్టార్ హీరోల సినిమాల గురించి అయితే అదే పనిగా ఆరాలు తీస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆడియన్స్ క్యూరియాసిటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు కాంత మూవీ టీమ్. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ముందు సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నాం అనే డేట్ వేశారు. బట్ సెప్టెంబర్ ఎంటర్ అయిన తర్వాత కూడా వీళ్లు ప్రమోషన్స్ గురించి పట్టించుకోలేదు. దీంతో సినిమా వస్తుందా రాదా అనే డౌట్స్ ఆడియన్స్ లో ఉన్నాయి. ఈ లోగా అదే డేట్ లో తెలుగు నుంచి కిష్కింధపురి, మిరాయ్ చిత్రాలు అనౌన్స్ అయ్యాయి. బట్ కాంత నుంచి ఏ సౌండ్ లేదు. ఓ రకంగా ఇది డైరెక్ట్ తెలుగు సినిమా కూడా కాదు. అయినా దుల్కర్ కు మంచి ఫ్యాన్స్ ఏర్పడ్డారు కదా తెలుగులో. అదీ కాక తమిళ్ తో పాటు, మళయాలంలోనూ అతనికి తిరుగులేని క్రేజ్ ఉంది. ఇంత క్రేజ్ ఉన్న హీరో మూవీని ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్ కు ఒక్క రోజు ముందుగా వాయిదా వేస్తున్నాం అని ప్రకటించడం ఆశ్చర్యం.

కాంత చిత్రాన్ని ప్రస్తుతం వాయిదా వేస్తున్నాం అని తాజాగా ప్రకటించారు. అందుకు కారణం.. మళయాలం నుంచి వచ్చిన లోకా చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. ఆ చిత్రాన్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేకే తమ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పారు. అసలు కారణం ఏంటంటే.. లోకా స్ట్రాంగ్ గానే ఉంది. అందులో డౌట్ లేదు. కాకపోతే ఈ చిత్రానికి నిర్మాత దుల్కర్ సల్మానే కావడం. అంతేకాక కాంత చిత్రానికి తనూ ఓ ప్రొడ్యూసర్. సో.. ఓ రకంగా రెండు రకాలుగా తనకే ఇబ్బంది. అందుకే కాంతను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే కొత్త డేట్ చెబుతారట.

ఇక సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు నుంచి రానా కూడా ఓ నిర్మాతగా ఉన్నాడు. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags

Next Story