Dulquer Salman vs Viswak Sen : విశ్వక్ సేన్ కు పోటీగా దుల్కర్ సాల్మన్

హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ అంటే ఆడియన్స్ కు మజా వస్తుంది.. మేకర్స్ కు టెన్షన్ వస్తుంది. ముఖ్యంగా హీరోల స్టార్డమ్ మధ్య తేడా ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్ ఒన్ సైడ్ అనిపిస్తుంది. బట్ స్టార్డమ్ కంటే కంటెంట్ కే ఆడియన్స్ ఎక్కువ ఓటు వేస్తారు. కాకపోతే ఓపెనింగ్స్ లో తేడాలు కనిపిస్తాయి అంతే. ఇక సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సిన సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సాల్మన్ నటించిన ఈ మూవీని వెంకీ అట్లూరి దర్శకత్వం చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. అయితే వినాయక చవితికి పోటీ ఎక్కువగా ఉంది. అందుకే మూవీని అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ చేశారు. అయితే అదే రోజు విశ్వక్ సేన్ నటిస్తోన్న మెకానిక్ రాకీ విడుదలవుతోంది. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో కూడా మీనాక్షి చౌదరినే హీరోయిన్. తనతో పాటు శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.
మెకానిక్ రాకీతో మరో కమర్షియల్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు విశ్వక్ సేన్. అయితే దుల్కర్ లాంటి స్టార్ అతనికి పోటీగా వస్తే మాత్రం కాస్త ఇబ్బందులు తప్పవు అనే చెప్పాలి. పైగా అదే రోజు తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటించిన అమరన్ డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలవుతోంది. శివకార్తికేయన్ కు ఇక్కడ పెద్ద క్రేజ్ లేకపోయినా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటు దుల్కర్ తెలుగు హీరో కాకపోయినా సినిమా సితార బ్యానర్ లో వస్తోంది కాబట్టి ఖచ్చితంగా భారీ రిలీజ్ ఉంటుంది. అది మెకానిక్ పైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ రెండు సినిమాల కంటెంట్స్ పరంగా చాలా వేరియేషన్ ఉంది. సంబంధం లేని కథలుగా వస్తున్నాయి. కాబట్టి కంటెంట్ బావుంటే రెండు సినిమాలకూ ఆదరణ ఉంటుంది. మొత్తంగా విశ్వక్ సేన్ కు ఇది ఊహించని పోటీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com