Happy Birthday Puri Jagannadh: ఆ హీరోతో సినిమా చేయడం పూరీ కల..

Happy Birthday Puri Jagannadh: ఆ హీరోతో సినిమా చేయడం పూరీ కల..
Happy Birthday Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీలో డైనమిక్ డైరెక్టర్లు చాలా అరుదు. అందులో బెస్ట్ పూరీ జగన్నాథ్.

Happy Birthday Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీలో డైనమిక్ డైరెక్టర్లు చాలా అరుదు. ఆ లిస్ట్‌లో బెస్ట్ అనిపించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh). ఈతరంలో అతనో ఫైరింగ్ అండ్ ఇన్స్ స్పైరింగ్ డైరెక్టర్. ఇండస్ట్రీలో తనకంటూ ఓ పాథ్ క్రియేట్ చేసుకుని అనేక మందికి మార్గదర్శిగా నిలిచిన పూరీ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా అతని సినిమా కెరీర్‌ను ఓ సారి రివైండ్ చేసుకుందాం..

చూడ్డానికి సింపుల్ గానే ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ థింకింగ్ లో, మేకింగ్ లో షార్ప్‌గా ఉంటాడు. పేజీల కొద్దీ డైలాగ్స్ పెట్టొచ్చు అనే చోట సింపుల్ డైలాగ్స్‌తో శెభాష్ అనిపిస్తాడు. ఇదే పూరీని స్పెషల్ డైరెక్టర్ గా మలిచింది. తొలినాళ్లలో దూరదర్శన్ లో దర్శకుడిగా పనిచేశాడు పూరీ జగన్నాథ్. మొదట్లో, సుమన్, కృష్ణ లాంటి వారితో సినిమాలు అనుకున్నాడు. కృష్ణతో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయింది. కానీ ఏవో కారణాలతో ఆగిపోయింది.

దర్శకుడిగా పూరీ శైలి విలక్షణం. ట్రెండ్ కు భిన్నమైన రూట్ ను క్రియేట్ చేసుకున్నాడు. హీరో అంటే సద్గుణ సంపన్నుడు, సకళ కళావల్లభుడు అన్నతెలుగు సినిమా సూత్రాన్ని చెరిపేసి తన హీరోని ఇడియట్ అనేశాడు. హీరో ఇడియట్ అంటే నిర్మాత భయపడతాడని తానే నిర్మాతగానూ మారాడు. అతని హీరో ఇడియట్ అయినా పోకిరి అయినా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడు.

ఇదే స్పీడ్ లో నాగార్జున ఇమేజ్ భిన్నంగా మెంటల్ పోలీస్ అంటూ చేసిన శివమణితోనూ హిట్ కొట్టాడు. నిజానికి ఈసినిమాలో నాగ్ ను చూసిన చాలామంది ఇది కదా మేం నాగ్ నుంచి కోరుకుంది అనుకున్నారు. అదే పూరీ స్పెషాలిటీ. హీరోల అభిమానులు ఏం కోరుకుంటారో ముందే ఊహించడం. అందుకే శివమణి నాగ్ కెరీర్ లో ఎప్పటికీ ఓ స్పెషల్ మూవీగా మిగిలిపోతుంది.


అంతకు ముందు ఎన్ని హిట్లున్నా.. పోకిరి పూర్తిగా పూరీ మార్క్ సినిమా. సింపుల్‌గా కనిపించినా బలమైన సన్నివేశాలు, ఇప్పటికీ ఊతపదాలుగా ఉన్న డైలాగులు. పూరీ టేకింగ్ కెపాసిటీకి అదే స్థాయిలో యాడ్ అయిన పెన్ పవర్ క్రియేట్ చేసిన సంచలనమే పోకిరి.

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని కలలు కనని డైరెక్టర్ ఉంటాడా. మరి అలాంటి దర్శకుడితో సినిమా చేయలేదు కానీ, ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా వెలుగుతోన్న రామ్ చరణ్‌ను వెండితెరకు పరిచయం చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు పూరీ. కథ రొటీనే అయినా.. హీరోగా రాణించడానికి చరణ్‌కి ఉన్న కేపబిలిటీస్ అన్నిటినీ చూపించాడు. అందుకే చిరు తనయుడు చిరుతలా అందరినీ మెప్పించాడు. అయితే చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అతని కల మాత్రం ఇంకా నెరవేరలేదు.

దాదాపు పన్నెండేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చేశాడు. బట్ కమర్సియల్ గా వర్కవుట్ కాలేదు. ఆ టైమ్ లో పూరీ పూర్తిగా తన మార్క్ కోల్పోయాడు. వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అయినా ఎన్టీఆర్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోను కూడా విలన్ గా చూపించేసి తన టెంపర్‌తో మరో హిట్ అందుకున్నాడు. టెంపర్‌తో తారక్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించి, తన కెరీర్‌కి బూస్టప్ ఇచ్చాడు.

రెండు దశాబ్దాల కెరీర్‌లో పూరీ జగన్నాథ్ తొలి దశాబ్ధాన్ని రూల్ చేశాడు. ఎంత పెద్ద స్టార్ అయినా అతనితో సినిమా చేస్తే అతను పూరీ హీరో అవుతాడు అనేలా ట్రెండ్ క్రియేట్ చేశాడు. అతని సినిమాల్లో హీరోల్లానే అతనూ రియల్ లైఫ్ లో డైనమిక్ గానే ఉంటాడు. అదే పూరీయిజంగా మారింది. ఈ ఇజం మరిన్ని విజయాలతో కొనసాగాలని కోరుకుంటూ.. పూరీకి మరోసారి బర్త్ డే విషెస్ చెప్తుంది టీవీ5.

Tags

Read MoreRead Less
Next Story