Mahesh Babu : మహేష్ బాబుకు ఈ.డి నోటీస్ లు.. అసలేం జరిగింది.?

సూపర్ స్టార్ మహేష్ కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఎప్పుడూ మిస్టర్ క్లీన్ లా కనిపించే అతనికి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ (ఈ.డి) నోటీస్ లు పంపించింది. అతను గతంలో సాయి సూర్య డెవలపర్స్ అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నాడు. సాయి సూర్యతో పాటు సురానా గ్రూప్ కూడా అందులో భాగస్వామిగా ఉంది. ఆ సురానా గ్రూప్ సంస్థలపై తాజాగా ఈ.డి సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఈ సంస్థ నుంచి మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా ఆధారాలు దొరికాయి. అయితే ఈ మొత్తం డబ్బులో కొంత భాగాన్ని ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు. మిగతా మొత్తాన్ని క్యాష్ రూపంలో ఇచ్చారట. అయితే ఆ క్యాష్ బ్లాక్ మనీగా వచ్చిందా లేక వైట్ మనీగానే చెల్లించారా అనే ఆధారాల కోసం ఈ. డి మహేష్ బాబుకు కూడా నోటీస్ లు పంపించింది.
నోటీస్ లు పంపించింది ఈ.డి కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబుకు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్ ఏం లేదు. ఏమైనా తేడా అనిపిస్తే మాత్రం తదుపరి చర్యల్లో మహేష్ నూ భాగస్వామిగా చేరుస్తారు. అప్పుడు ఆయన ఆ మనీకి సంబంధించిన ట్యాక్స్ ల విషయంలో సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com