Yendira Ee Panchayati ప్యూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ లుక్

నూతన నటులు భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న 'ఏందిరా ఈ పంచాయితీ' అనే సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను గమనిస్తే ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపై చూపించనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా రిలీలైన ఈ ఫస్ట్ లుక్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా ఈ పోస్టర్ లో కొన్ని సంకేతాలను వదిలారు. ఇంతకుముందు టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్.. ఇప్పుడు చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. ఈ పోస్టర్ ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా అనిపిస్తోంది. హీరో హీరోయిన్ ల ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని.. ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ తెప్పిస్తుందని మాత్రం అర్థమవుతోంది.
డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్ గా టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఈ తరం ప్రేక్షకలోకం మెచ్చే సినిమాగా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు. కాబట్టి ఈ లెక్కన చూస్కుంటే ఈ సినిమాలో కూడా నేచురల్ సన్నివేశాలను జోడించారు కాబట్టి 'ఏందిరా ఈ పంచాయితీ' మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకే ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారు. అయితే నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ' అని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
The captivating 1st Look of #YendiraEePanchayati establishes the sparkling chemistry of the lovebirds #Bharat #VishikaLaxman#GangadharaT #PradeepKumarM #PrabhatCreations #PR #SatishMasam @JanakiramaraoP@PROSaiSatish @ParvathaneniRam pic.twitter.com/Bx01gHnxrg
— Mango Music (@MangoMusicLabel) August 17, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

