Yendira Ee Panchayathi Glimpse : లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ తో గ్లింప్స్

Yendira Ee Panchayathi Glimpse : లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ తో గ్లింప్స్
ఏందిరా ఈ పంచాయితి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న 'ఏందిరా ఈ పంచాయితి' సినిమాతో భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊరి వాతావరణం, అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు, కుల వృత్తులను కళ్లకు కట్టినట్టు చూపించిన మేకర్స్.. ఇప్పుడు మూవీ కథాంశాన్ని వెల్లడించారు.

ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ సినిమాకు గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన మూవీ పోస్టర్.. ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారని వెల్లడైంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఇక తాజాగా రిలీజైన గ్లింప్స్ ను పరిశీలిస్తే.. "నీ గురించి ఆలోచించడానికి అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా" అని హీరోయిన్ చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక హీరోహీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. వీరిద్దరి ప్రేమ నేపథ్యంలో నెలకొనే గొడవలు ఎక్కడికి దారి తీస్తాయి.. వారు ఎలా పరిణామాలు ఎదుర్కొంటారన్నది కథాంశంగా తెలుస్తోంది.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పెద్దపల్లి రోహిత్ సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకి మాటలు వెంకట్ పాల్వాయ్,ప్రియాంక ఎరుకల, ఎడిటర్ జెపి, డీఐ పీవీబీ భూషణ్ అందిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story