Karishma Tanna Wedding: పెళ్లి ఎంట్రీలో నటి డ్యాన్స్.. షాక్ అయిన పెళ్లికొడుకు..

Karishma Tanna Wedding: పెళ్లి ఎంట్రీలో నటి డ్యాన్స్.. షాక్ అయిన పెళ్లికొడుకు..
X
Karishma Tanna Wedding: కరిష్మా తన్నా.. బిగ్ బాస్ 8వ సీజన్‌లో పాల్గొంది. అక్కడే తాను ఉపేన్ పటేల్‌తో ప్రేమలో పడింది.

Karishma Tanna Wedding: ఈమధ్య చాలామంది మామూలుగా ఏ హంగు ఆర్భాటం లేకుండా మామూలుగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. పెళ్లి అనేది జీవితంలో మళ్లీ మళ్లీ జరగని విషయం అనుకొని ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధపడిపోతున్నారు. మరి మామూలు వారి మాటే ఇలా ఉంటే.. సెలబ్రిటీల పరిస్థితి ఏంటి..? ఇటీవల కాలంలో సెలబ్రిటీల పెళ్లిల్లు ఎలా జరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ బాలీవుడ్ నటి పెళ్లి బీ టౌన్‌లో బాగా ఫోకస్ అవుతోంది.

ముందుగా బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్‌తో పేరు తెచ్చుకుంది కరిష్మా తన్నా. ఇటీవల అలాగే గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది మౌనీ రాయ్. ఇక మౌనీ రాయ్ తర్వాత ఆ రేంజ్‌లో అటెన్షన్ తెచ్చుకోగలిగింది కరిష్మా తన్నా. తాజాగా జరిగిన తన సంగీత్‌లో కరిష్మా.. ఊ అంటావా ఊఊ అంటావా పాటకు స్టెప్పులేసింది. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరిష్మా తన్నా.. బిగ్ బాస్ 8వ సీజన్‌లో పాల్గొంది. అక్కడే తాను ఉపేన్ పటేల్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు రెండేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఎందుకో ఆ బంధం ముందుకు వెళ్లలేదు. ఇంతకాలం సింగిల్‌గా ఉన్న కరిష్మా.. ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ బంగేరాను ప్రేమించి తాజాగా పెళ్లి కూడా చేసుకుంది. ఈ పెళ్లిలో కరిష్మా ఎంట్రీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ముందుగా కరిష్మా.. మామూలుగానే పెళ్లి మండపంలో అడుగుపెడుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయి తనకు కాబోయే భర్త వరుణ్ కోసం 'సజ్నా తేరే లియే' అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఇది చూసి వరుణ్ ముందుగా షాక్ అయినా ఆ తర్వాత అందరికంటే ఎక్కువగా తానే ఎంజాయ్ చేశాడు. కరిష్మా తన్నా పెళ్లి తంతు అంతా వెడ్డింగ్ గోల్స్‌లాగా ఉందంటూ ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.


Tags

Next Story