Erica Fernandes: సన్నగా ఉన్నందుకు సౌత్‌లో అలా చేసేవారు.. చాలా సిగ్గుగా అనిపించేది: బాలీవుడ్ నటి

Erica Fernandes (tv5news.in)
Erica Fernandes: హీరోయిన్ అంటే మరీ లావుగా ఉండకూడదు.. మరీ సన్నగా ఉండకూడదు.. ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంటూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉండాలి. సినిమాలో క్యారెక్టర్‌కు తగినట్టు ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకోవాలి. ఏ ఇండస్ట్రీ అయినా కూడా ఇదే ఫార్ములా. అందుకే బాడీ షేమింగ్ వల్ల ఇప్పటికీ ఎందరో నటీమణులు అవమానాలు ఎదుర్కున్నారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న అవమానాల గురించి బయటపెట్టింది ఓ బాలీవుడ్ నటి.
సౌత్‌లో హీరోయిన్లు మరీ సన్నాగా ఉన్నా ఇష్టపడరు అంటోంది ఎరికా ఫెర్నాండేజ్. బాలీవుడ్ సీరియళ్లతో తన కెరీర్ ప్రారంభమయ్యింది. పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆమె హీరోయిన్‌గా నటించింది. అయితే తనను వెండితెరపై హీరోయిన్‌గా పరిచయం చేసింది మాత్రం సౌత్ ఇండస్ట్రీనే. తాజాగా ఆ సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఎరికా.
సౌత్‌లో హీరోయిన్లు బొద్దుగా ఉండేవారని కానీ తాను మాత్రం సన్నగా ఉండడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కున్నానని చెప్పింది ఎరికా. అందుకే లావుగా కనిపించడం కోసం తన శరీరంపై ప్యాడ్స్ పెట్టేవారట. అలా చేస్తున్నప్పుడు తనకు చాలా సిగ్గుగా ఉండేది అన్న విషయాన్ని బయటపెట్టింది ఈ భామ. అంతే కాకుండా అలా ప్యాడ్స్ పెట్టుకొని నటించేందుకు ఇబ్బందిగా ఉండేదని తెలిపింది.
తెలుగులో 'గాలిపటం' లాంటి సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఎరికా ఫెర్నాండేజ్.. మళ్లీ తెలుగుతెరపై మెరవలేదు. మూడున్నరేళ్లుగా ఒకరితో ప్రేమలో ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది ఎరికా. కానీ ఆ రిలేషన్ అంత సీరియస్‌గా నడవలేదని, ఇప్పుడు తాను సింగిల్ అని స్పష్టం చేసింది. ఎరికా చివరిగా 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే బీ 3' అనే సీరియల్‌లో నటించి అలరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com