Erracheera : దీపావళి కానుకగా సుమన్ బాబు 'ఎర్రచీర'

Erracheera : దీపావళి కానుకగా సుమన్ బాబు ఎర్రచీర
'ఎర్రచీర' రిలీజ్ డేట్ ఖరారు చేసిన మేకర్స్

టాలీవుడ్ లో అనేక సినిమాల్లో అలరించిన హీరో శ్రీరామ్, నటుడు అజయ్ తో పాటు అయ్యప్ప పి. శర్మ కలిసి ఓ సస్పెన్స్ మూవీలో కనిపింబోతున్నారు. వీరు ముగ్గురూ కలిసి ప్రధాన పాత్రలుగా రూపొందుతోన్న చిత్రం 'ఎర్రచీర'. బేబీ డమరి సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించగా.. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం 'ఎర్రచీర' సినిమాను దీపావళి కానుకంగా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 9న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు.

మేకర్స్ తాజాగా రివీల్ చేసిన పోస్టర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. కాగా 'ఎర్రచీర' సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలోనూ రిలీజ్ కానుండడం చెప్పుకోదగిన విషయం. అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారని ఈ సందర్భంగా ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో శ్రీరామ్ తో పాటు 'కేజీఎఫ్' ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు Dr. రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు అయిన 'మహానటి' ఫేమ్ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, సుమన్ బాబు, అజయ్, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కృష్ణ తదితరులు నటించారు.

ఇక 'ఎర్రచీర' సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన 'శివ శివ శంభో శంకర', 'రొమాంటిక్ సాంగ్ గా వచ్చిన తొలి తొలి ముద్దు.. ముద్దుపైన 150 ముద్దులు అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు కె. సత్యసుమన్ బాబు లిరిక్స్ అందించగా.. సౌమ్య, హేమ చందర్ పాడారు. కుటుంబ బాంధవ్యాలకు, అనురాగాలకు పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు ఇంతకుమునుపే వెల్లడించారు. కుటుంబ కథే అయినా.. హారర్ థ్రిల్లింగ్ అంశాల్ని కూడా జోడించామని, వాణిజ్యాంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని చెప్పారు. ప్రమోద్ అంచిన స్వరాలు సినిమాకు ప్రధాన బలం అని, సినిమాలోని పాటల లిరిక్స్ ప్రేక్షకుల్లోకి లోతుగా దూసుకువెళ్తాయని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story