Ester Noronha: అలాంటి హీరోయిన్ల స్క్రీన్ షాట్స్ చూశాను: ఎస్తర్

Ester Noronha (tv5news.in)
Ester Noronha: కొంతమంది నటీనటులకు ఎంత టాలెంట్ ఉన్నా.. కొన్ని సందర్భాల్లో లక్ కలిసి రాక ఇండస్ట్రీలో స్థిరపడలేకపోతారు. అలాంటి వారు ఎంతోమందికి క్యాస్టింగ్ కౌచ్ ఆశ చూపిస్తుంది. అందులో కొందరు వారికి లొంగిపోతారు. మరికొందరు ఆ దారిలో వెళ్లకూడదని ఆగిపోతారు. అలాంటి క్యాస్టింగ్ కౌచ్‌కు తాను ఎప్పుడూ లొంగలేదని చెప్పుకొచ్చింది ఎస్తర్ నోరోన్హ.
పలు సినిమాల్లో హీరోయిన్‌గా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది ఎస్తర్. కానీ ఏ సినిమా కూడా తనకు కావాల్సినంత గుర్తింపును తీసుకురాలేకపోయింది. తాజాగా '69 సంస్కార్ కాలనీ' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఎస్తర్.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగానే ఇప్పటికే ఒకసారి క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్తర్.. మరోసారి దాని గురించి ప్రస్తావించింది.
ఇండస్ట్రీలో అన్‌ప్రొఫెషనల్ ట్రాక్స్ తాను చాలా చూశానని బయటపెట్టింది ఎస్తర్. తనకు సినిమా ఆఫర్లతో పాటు అలాంటి ఆఫర్లు కూడా వచ్చేవని తెలిపింది. వాళ్లని ఇంప్రెస్ చేయమని అడుగుతూ ఉండేవారని చెప్పింది ఎస్తర్.
ఆఫర్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారని, అలాంటి వాటి స్క్రీన్ షాట్స్ కూడా తాను చూశానని స్పష్టం చేసింది ఎస్తర్. కెరీర్ కోసం ఏమైనా చేస్తాం అనేవాళ్లని, స్వయంగా ఆఫర్లు ఇచ్చే ఆడవాళ్లను కూడా చూశానని చెప్పింది ఎస్తర్. అయితే అలాంటి క్యాస్టింగ్ కౌచ్‌ను తాను కూడా ఎదుర్కున్నానని మరోసారి బయటపెట్టింది. కానీ ఆఫర్ల కోసం అలాంటి నీచమైన పనులు తాను చేయనని క్లారిటీ ఇచ్చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com