Ester Noronha: సినిమాల్లో అవకాశాల కోసం..: నోయల్ మాజీ భార్య

Ester Noronha: సినిమాల్లో అవకాశాల కోసం..: నోయల్ మాజీ భార్య
X
Ester Noronha: ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోతుందని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతారు.

Ester Noronha: క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో ఆ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. అవకాశాలు రావాలంటే వాళ్లు చెప్పినట్లు నడుచుకోవాలి.. లేదంటే మీకంటే వెనుక వచ్చిన వాళ్లు ముందుకెళ్లి పోతున్నారు అంటూ మనల్ని ఆ ఊబిలోకి లాగే ప్రయత్నం చేస్తారు.. అలాంటివి తానూ ఎదుర్కున్నానని సింగర్ నోయల్ మాజీ భార్య ఎస్తర్ నోరోన్హ చెప్పుకొచ్చింది. భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్‌గా మెప్పించినా ఆ తరువాత అవకాశాలు రాలేదు. సింగర్ నోయల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ప్రస్తుతం కన్నడ బాట పట్టి అక్కడ పని చేస్తున్న ఎస్తర్.. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.


ఆఫర్స్ రావాలంటే కమిట్‌మెంట్ అడిగారు.. ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోతుందని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతారు. సినిమా అంటే ఇష్టమే.. కానీ అదే జీవితం కాదు.. అవకాశాల కోసం అలా దిగజారడం ఎంత మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని వివరించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరినీ తప్పు పట్టలేం. అవకాశాల కోసం వాళ్లు, ఆఫర్ ఇస్తామని వీళ్లు.. ఎవరినీ బ్లేమ్ చేయలేం. ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి అని తెలిపింది ఎస్తర్.

Tags

Next Story