మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా..'ఎవరు మీలో కోటీశ్వరులు' ముహూర్తం ఫిక్స్

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు ఎన్టీఆర్. స్మాల్ స్ర్కీన్ పై 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' అనే రియాలిటీ షో రానుంది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు ఎన్టీఆర్. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ షో ఎప్పటి నుంచి స్టార్ట్ కానుందో క్లారిటీ ఇచ్చారు. అగష్టు 22వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు.
సోమవారం నుంచి బుధవారం వరకు సాయంత్రం 8.30 గంటలకు ప్రసారం కానుంది. తాజాగా జెమిని టీవీ ఈ షో ప్రోమోను విడుదల చేసింది. ప్రోమోలో తారక్ వస్తున్న మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రతి సోమవారం నుంచి బుధవారం సాయంత్రం రాత్రి 8:30 గంటలకు మీ జెమిని టీవీలో' అంటూ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ విషయానికి వస్తే.. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRRలో.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com