Evaru Meelo Koteeswarulu: పూనకాల ఎపిసోడ్ డేట్ ఫిక్స్.. మహేష్ వచ్చేది అప్పుడే..

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. ఈ షో ద్వారా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి వ్యక్తిగానిలిచారు. ఇక అప్పుడప్పుడు సినిమా సెలబ్రిటీలు షోలో సందడి చేస్తుంటారు. సినిమా తారలతో ఓ ఆట ఆడుకుంటాడు హోస్ట్ ఎన్టీఆర్..
అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు ఎవరు మీలో కోటీశ్వరులులో. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేస్తారో అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈనెల 5న ఆదివారం రాత్రి 8.30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు జెమినీటీవీ ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌ను పూనకాల ఎపిసోడ్‌గా అభివర్ణిస్తూ కొద్ది రోజుల క్రితమే ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సారి తెరపై కనిపించనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. షోలో గేమ్ ఆడుతూ చాలానే సంగతులు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సంధించిన ఓ ప్రశ్నకు తడబడ్డ మహేష్ వీడియో కాల్ ఆప్షన్ ద్వారా పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకేం.. అభిమానులకు పండగే. ముగ్గురు హీరోలు ఒకేసారి తెరపై.. వావ్.. సూపర్ కదా అని అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com