'ఎవరు మీలో కోటీశ్వరులు'అదరగొట్టిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. హైలెట్‌గా పవన్ ప్రస్తావన
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై మరోసారి సందడి చేశారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' అనే రియాలిటీ షో ఈ ఆదివారం ఎంటో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చిన హాట్ సీటులో కూర్చున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు బాగా వైరల్ అయ్యాయి. మార్చిలోనే షోకి సంబంధించి ఎంట్రీలు నమోదు చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అన్ని అడ్డంకులు దాటుకోని ఆదివారం ఈ షో ప్రారంభమైంది.
శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్ షో ప్రారంభించారు. షోలో ఎంత మని గెలిస్తే అంత చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేస్తానంటూ రామ్ చరణ్ షో మొదలు పెట్టారు. ఇప్పటివరకు రూ.80,000 గెలుచుకుని ముందుకు సాగుతున్నారు.
నెమ్మదిగా మాటలు కలిశాక నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఇక ఈ షోలో హోస్ట్‌గా ఎన్టీఆర్ అడిగిన పలు ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ హీరోలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
ఆరంభంలో రాంచరణ్ కు చాలా సులువైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్..చరణ్ ని ఒక్కో ప్రశ్న అడగడం.. చరణ్ సమాధానం ఇచ్చాక కొంత సమయం ఆ ప్రశ్న గురించి సరదాగా మాట్లాడుకోవడం లాంటి అంశాలతో షో ఎంటర్టైనింగ్ గా ఆరంభం అయింది.
ఈ సందర్భంగా తన దగ్గర 6 కుక్కులున్నాయి. మరోవైపు గుర్రాలను పెంచుకోవడం అంటే ఎంతో సరదా అన్నారు. అంతేకాదు తన దగ్గర ఉన్న గుర్రాలలో ఒక దాని 'బాద్‌షా' అని చెప్పారు. 'మగధీర'లో నేను రైడ్ చేసిన గుర్రం అదే అని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. మగధీర రిలీజయ్యాక అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్.
ఈషో ఆర్ఆర్ఆర్ చెందిన పలు ఆసక్తికర అంశాలు కూడా పంచుకున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్'లో కొమరం భీమ పాత్ర హైలెట్. స్క్రీన్ పై తారక్ ను చూసి అందరు ఫిదా అవుతారు. రిలీజయ్యాక మీరే మాట్లాడుకుంటారు అని ఆర్ఆర్ఆర్ పై ఆసక్తికరంగా మాట్లాడారు చరణ్.
ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. 'కొమరం భీమ్' పాత్రలో నటించడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమరం భీమ్‌గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా.. అలాంటి గొప్ప యోధుల పాత్రల్లో నటించడం మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఒకింత ఎమోషనల్ అయ్యారు.
ఆచార్య సినిమాపై పలు ప్రశ్నలు అడిగారు తారక్.. దానిపై స్పందించిన రామ్ చరణ్ .. నాన్న చిరంజీవితో పూర్తి స్థాయిలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో నటించేటపుడు స్కూల్లో ప్రిన్స్‌పల్‌తో ఎలా ఉంటానో అలాగా ప్రవర్తించాను. నీ, నా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను మంచి ఎమోషన్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా పూర్తి మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు చరణ్,
పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్. నాన్నగారు షూటింగ్స్ తో బిజిగా ఉన్నప్పుడు బాబాయే తనని తండ్రిలా చూసుకున్నారు అని రాంచరణ్ తెలిపాడు. తమది మాటల్లో చెప్పలేని బంధం అని చరణ్ తెలిపాడు. నాన్నగారు నాతో చెప్పలేని విషయాలని బాబాయ్ చెప్పేవారు అని రాంచరణ్ తెలిపాడు. ఇక తను ఎపుడు బోర్ ఫీలైనపుడల్లా 'అదుర్స్' సినిమా చూసి రిలాక్స్ అవుతూ ఉంటాను. అందులో నీ కామెడీ టైమింగ్, పంచ్‌లు నిజంగా అదుర్స్ అంటూ ఎన్టీఆర్ యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు రామ్ చరణ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com