Hari Hara Veera Mallu : వీరమల్లు.. ఇక ఆడియన్స్ చేతిలో

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఒకట్రెండు రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఆరేళ్లకు పైగా చిత్రీకరణ చేసుకుని.. అనేక సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన సినిమా ఇది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిర్మాత ఏఎమ్ రత్నంలో ధైర్యం నింపాడు. మొదటి దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడాడు. హీరోయిన్ ను పొగిడాడు. తన శైలికి భిన్నంగా ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ చేశాడు. అయినా ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ కంటే ఓ.జి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ విషయంలోనూ వారిని సున్నితంగా మందలించాడు. మొత్తంగా అన్నీ క్లియర్ చేసుకుని ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సో.. ఇన్నేళ్లూ ఎలా ఉన్నా.. బలమైన కంటెంట్ కూడా ఉందనే హామీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత తను ఈ సినిమాకు యాక్షన్ కొరియాగ్రఫీ చేశానని చెప్పడం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెప్పడం ఫ్యాన్స్ లోనూ కిక్ నింపింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. రిలీజ్ డే రిజల్ట్ కీలకం కాబోతోంది. మొదటి ఆట పూర్తయిన వెంటనే పాజిటివ్ టాక్ వచ్చేలా చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే వాంటెడ్ గా కాదు. నిజంగానే సినిమా బావుంది అనే జెన్యూన్ రివ్యూస్ వస్తే.. అప్పుడు నిర్మాత కష్టాలు కడతేరిపోతాయి. ఇన్నాళ్లూ వెయిట్ చేసినందుకు చూసిన ప్రేక్షకులకూ ఓ సంతృప్తి మిగులుతుంది. సో.. ఇక వీరమల్లు రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com