Ram Charan : ఆరెంజ్ కు అద్భుతమైన రెస్పాన్స్

Ram Charan :  ఆరెంజ్ కు అద్భుతమైన రెస్పాన్స్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేశారు. ప్రధానంగా యూత్ అంతా ఈ చిత్రానికి వరస కట్టారు. అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. చాలా చోట్ల ఎక్స్ ట్రా షోస్ కు డిమాండ్ పెరుగుతోంది. యంగ్ స్టర్స్ అంతా థియేటర్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఓ థియేటర్ లో అయితే తన గాళ్ ఫ్రెండ్ కు రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేశాడో కుర్రాడు. మరో థియేటర్ లో ప్రతి పాటనూ కోరస్ గా పాడేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా రామ్ చరణ్ సినిమా రీ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇతర హీరోల అభిమానుల్లో యంగ్ స్టర్స్ అంతా ఆరెంజ్ మూవీని అభిమానిస్తారు.

2010లో మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా ఇది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. నాగబాబు నిర్మించాడు. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అయితే అప్పట్లో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో హీరో ఎనిమిది మందిని ప్రేమిస్తాడు. ప్రేమకు అతని నిర్వచనాలు డిఫరెంట్ గా ఉంటాయి. అవి నచ్చకపోయినా అతనంటే ఇష్టం హీరోయిన్ కు. ఎవరికి ఏం చెప్పినా కన్విన్సింగ్ గా చెబుతాడు హీరో. మంచి లవ్ స్టోరీ అని చాలాకాలానికి తేలింది. బట్ ఆ టైమ్ లో నిర్మాతగా నాగబాబును తీవ్రమైన అప్పుల్లో నింపింది సినిమా.

సినిమాకు మెయిన్ ఎసెట్ అంటే హ్యారిస్ జయరాజ్ పాటలే. ఆ పాటలు నేటికీ మార్మోగుతూనే ఉంటాయి. మరి ఆరెంజ్ ఒరిజినల్ వాల్యూ తెలిసిన తర్వాత థియేటర్స్ లో చూస్తున్నారంటే ఈ మాత్రం సందడి ఉంటుంది కదా.

Tags

Next Story