Khel Khel Mein : ఖేల్ బేల్ మే ఉత్సాహం

ప్రేమ, నమ్మకం,ద్రోహం ఇతి వృత్తంగా తెరకెక్కిన సినిమా ఖేల్ ఖేల్ మే. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కాబోతోంది. అక్షయ్కి జోడీగా వాణి కపూర్, అమ్మీ విర్క్ తాప్సీ పన్ను మరియు ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్లు నటించారు. ప్రగ్యా జైస్వాల్ 2014లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మిర్చిలాంటి కుర్రోడుతో తెలుగు తెరకు పరి చయమైంది. కంచె, ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. బా లకృష్ణకు జోడీగా నటించిన అఖండ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిదీ అమ్మడు. ఇప్పుడు బాలయ్యతో ఎన్బీకే 109 సినిమా చేస్తోంది. దీంతో పాటు టైసన్ నాయడు సినిమాలోనూ నటిస్తోంది. ఎప్పటికప్పు డు సోషల్ మీడియాలో తన ఫొటో లను షేర్ చేస్తూ ఫాలోవర్లను ఫిదా చేస్తుంది. ఈ బోల్డ్ బ్యూటీ ఫోటో ట్రీట్ కి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ ముంబై బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వేగంగా దూసుకెళుతోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజ న్లు.. ఇదంతా రేపు విడుదల కాబోయే ఖేల్ ఖేల్ మే ఉత్సాహం అని కామెంట్లు పెడుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ అక్షయ్ కుమార్ జోడిగా నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా రేపు థియేరట్లలో విడుదల కాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com