Salmankhan : సల్మాన్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ !

బాలీవుడ్ భాయీ జాన్ సల్మాన్ ఖాన్ ఆఖరుగా ‘టైగర్ 3’మూవీలో నటించాడు. ఆ తర్వాత మరో సినిమా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ అనే మూవీ సెట్స్ పై ఉంది. అసలు విషయానికొస్తే .. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ‘కిక్’ మూవీ సంచలన విజయం సాధించింది. యాక్షన్ కామెడీ గా రూపొందిన ఈ మూవీ రవితేజ నటించిన కిక్ తెలుగు సినిమాకి అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి కిక్ 2 గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు . కానీ దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే కిక్ 2 త్వరలో రాబోతోంది. సజిద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్‌తో సికందర్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత కిక్ 2ని ప్రకటిస్తానని వెల్లడించారు.
కిక్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావస్తోందని, తానే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని సాజిద్ చెప్పాడు. సరే, సల్మాన్ అభిమానులకు ఇది పెద్ద వార్త.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com