Jr NTR : రెండు కాదు ఒకటే.. ఎన్టీఆర్ సినిమాపై క్రేజీ అప్డేట్..

Jr NTR : రెండు కాదు ఒకటే.. ఎన్టీఆర్ సినిమాపై క్రేజీ అప్డేట్..
X

దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆ జోష్ లోనే తన తదుపరి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వాటిలో ఒకటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సినిమాలను రెండు పార్టులుగా చేయడం ఎక్కువైపోయింది. స్టార్ హీరోలు తన సినిమాకాను రెండు పార్ట్స్ గా విడుదల చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారట. ఎన్టీఆర్ 31 సినిమాను కేవలం ఒకే పార్ట్ గా చేయడానికి ఫిక్స్ అయ్యారట. అది కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి విజయాన్నీ సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story