Devara Update : ఎక్స్ క్లూజివ్.. దేవర సెకండ్ సింగిల్ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న దేవర అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా చూస్తున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ క్రేజీ అనిపించుకున్న అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా చిన్న టీజర్ విడుదల చేశారు. కానీ అది సరిపోలేదు. తరవాత వచ్చిన సాంగ్ ఏమంత ఆకట్టుకోలేదు. ఇది సినిమాలో మాంటేజ్ సాంగ్ గా ఉంటుంది. అందుకే డైరెక్ట్ గా కనెక్ట్ కాలేదు. ఇక రిలీజ్ టైమ్ దగ్గరకు వస్తున్నా.. మూవీపై బజ్ క్రియేట్ కాలేదు. ఫ్యాన్స్ కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం కొరటాల శివ అనేది నిజం.
ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాలతో ఎన్టీఆర్ సినిమా చేయడం ముందు నుంచీ అభిమానులకు ఇష్టం లేదు. అయినా అతను తగ్గేదే లే అన్నట్టుగా ఆయనతోనే కమిట్ అయ్యాడు. దీనికి తోడు ఇప్పుడు మూవీకి పెద్ద బజ్ లేదు. అయినా సెకండ్ సింగిల్ సాంగ్ వస్తే సిట్యుయేషన్ మారుతుందని కొందరు ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అదే పనిగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు.. ఎప్పుడు అంటూ అదే పనిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసమే ఈ అప్డేట్.
దేవర సెకండ్ సాంగ్ ను ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అనౌన్స్ చేయబోతున్నారు. అంటే పాట రాదు. ఆ పాట ఎప్పుడు వస్తుందో ఫస్ట్ వీక్ లో చెబుతారన్నమాట. మాగ్జిమం ఆగస్ట్ 3, 4 తేదీల్లో సాంగ్ డేట్ అనౌన్స్ కావొచ్చు. కుదిరితే ప్రోమో కూడా ఇవ్వాలనుకుంటున్నారట. ఈ పాటలో జాన్వీ కూడా ఉంటుంది. ఒక రొమాంటిక్ డ్యూయొట్ నంబర్ అంటున్నారు. అదీ మేటర్. దేవర సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వస్తుందన్నమాట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com