Rajamouli - Mahesh : రాజమౌళి - మహేష్ మూవీపై ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్
టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అంటే రాజమౌళి - మహేష్ బాబుదే. ఈ ఇద్దరి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ కాంబోలో మూవీ అనౌన్స్ అయింది. ఇప్పుడు రాజమౌళి ఇమే్జ్ కు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మూవీ రాబోతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందని ముందు నుంచీ చెబుతున్నారు. బంగారు గనుల నేపథ్యం ప్రధానంగా ఉంటుందని టాక్. అందుకే ఈ చిత్రానికి ‘గోల్డ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే అనౌన్స్ మెంట్ అయింది కానీ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స లేవు. దీంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. వారి కోసమే ఈ న్యూస్.
ప్రస్తుతానికి గోల్డ్ అనే టైటిలే ఫైనల్ అనుకుంటే ఈ మూవీకి సంబంధించిన వర్క్ షాప్ ను అక్టోబర్ లో స్టార్ట్ చేస్తారట. అంతకు ముందే అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఓ కీలకమై అప్డేట్ కూడా వస్తుందని టాక్. నెలాఖరులో స్టార్ట్ అయ్యే వర్క్ షాప్ ఓ ఇరవై రోజుల పాటు కొనసాగుతుందట. ఈ వర్క్ షాప్ లో మెయిన్ ఆర్టిస్ట్స్ అంతా ఉంటారు. గతంలో బాహుబలికి కూడా ఇలాంటి వర్క్ షాప్స్ నే కండక్ట్ చేశాడు జక్కన్న.
ఇక కీలకమైన షూటింగ్ ను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. యస్.. ఈ డిసెంబర్ నుంచి విదేశాల్లో ఓ లాంగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేయబోతున్నారు. ఆ షెడ్యూల్ లోనే ఓ పవర్ ఫుల్ ఛేజింగ్ సీన్ ను షూట్ చేస్తారట. ఇది సినిమాలో హైలెట్ సీన్స్ లో ఒకటి అంటున్నారు. మొత్తంగా ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే నాన్ స్టాప్ గా వెళతారని టాక్. సో.. అక్టోబర్ లో వర్క్ షాప్, డిసెంబర్ నుంచి షూటింగ్.. ‘గోల్డ్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం. ఇదీ మేటర్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com