Eyy Bidda Idhi Naa Adda : 'పుష్ప' నుంచి పక్కా ఊరమాస్ పాట.. అద్దిరిపోయిందిగా..

Eyy Bidda Idhi Naa Adda : క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీటవుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న పుష్ప.. తొలి పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ వేగం ఊపందుకుంది.
ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు దాక్కో దాక్కో మేక, చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే, సామీ సామీ పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. తాజాగా మరోపాటని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే.. తలపైన ఆకాశం ముక్కా నాదే.. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ ఈ పాట సాగుతుంది.
ఈ సాంగ్ అల్లు అర్జున్ ఊరమాస్ లుక్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో అందాల తార సమంత ఓ ఐటెం సాంగ్ కనిపించనుందని టాక్ రావడంతో సినిమాపై అంచనాలు పెంచేసాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com