F3 Trailer: 'ఎఫ్ 3' ట్రైలర్ రిలీజ్.. డిఫెక్ట్స్‌తో నవ్విస్తున్న హీరోలు..

F3 Trailer: మామూలుగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి 2019లో విడుదలయిన 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణ పొందింది. అందుకే దీనికి సీక్వెల్‌గా 'ఎఫ్ 3'ను తెరకెక్కించాడు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది.
మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్.. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేశ్ కలిసి మల్టీ స్టారర్ చేయడం 'ఎఫ్ 2'కు ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. దాంతో పాటు కామెడీ కూడా బాగా పండడంతో ఎఫ్ 2 సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే అదే కాంబినేషన్‌తో 'ఎఫ్ 3'తో మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
తాజాగా విడుదలయిన 'ఎఫ్ 3' ట్రైలర్‌లో వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నవ్వులు పూయించారు. అంతే కాకుండా వెంకటేశ్‌కు ఈ సినిమాలో రేయి చీకటి ఉండడం.. వరుణ్ తేజ్‌కు నత్తి ఉండడం లాంటి అంశాలు మరింత ఫన్ క్రియేట్ చేసేలాగా ఉన్నాయి. క్యాస్టింగ్ విషయానికొస్తే.. ఎఫ్ 2లో ఉన్న నటీనటులే దాదాపు ఇందులో కూడా ఉన్నారు. అంతే కాకుండా ఇది మొత్తంగా మనీ చుట్టూ తిరిగే కథలాగా అనిపిస్తోంది. ఎఫ్ 3 సినిమా మే 27న విడుదల కానుంది.
We're back with double the FUN!!#F3Trailer is here!
— Venkatesh Daggubati (@VenkyMama) May 9, 2022
▶️https://t.co/TQ64O5rZAT
Laughs locked for May 27th 😂#F3Movie@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @Mee_Sunil @ThisIsDSP @SVC_official @adityamusic#F3OnMay27 pic.twitter.com/3JCiNuLqD8
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com