Vaani Kapoor : వర్ణ వివక్షను ఎదురుకున్నా : వాణీ కపూర్

Vaani Kapoor : వర్ణ వివక్షను ఎదురుకున్నా : వాణీ కపూర్
X

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ మూవీ శుద్ధి దేశీ రొమాన్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వాణీ కపూర్. ఆ సంస్థ నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమాలు ఆహా కళ్యాణం, బేఫిక్రేలలో నటించి విమర్శలు ఎదుర్కొం ది. దీంతో మూడేళ్ల పాటు విరామం తీసుకుంది. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్ వార్, క్రైమ్ థ్రిల్లర్ రైడ్ మూవీస్ లో చిన్న పాత్రలలో నటించి కమ ర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఈ భామ యష్ రాజ్ ఫిల్మ్స్ ఆస్థాన హీరోయిన్ గా పాపులర్ అయింది. ఈమెకు ఆదిత్య చోప్రా మార్గదర్శకుడిగా నిలిచాడు. తమ బ్యానర్ సినిమాల్లో అవకాశం కల్పించాడు. అయినప్పటికీ ఈ భామ నటిగా నిరూపిం చుకునే గొప్ప అవకాశాలు రాలేదు. కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో మాత్రమే నటించింది. ఇదిలా ఉంటే.. తాను వర్ణ వివక్ష ఎదుర్కొన్నట్లు తాజాగా ఓ ఇంట ర్వ్యూలో చెప్పందీ భామ. తన శరీరం అంతగా తెల్లగా లేదని విమర్శలొచ్చాయని పేర్కొంది. కలర్ లేదని, బక్కగా కనిపిస్తోందని కొందరు విమర్శించారట. సన్నగా, పొడవుగా ఉండటం కూడా తనకు సమస్యలు తెచ్చి పెట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె నటించిన మండలా మర్డర్స్ ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైంది. అందులో వాణీ కపూర్ గన్ చేత పట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనిపిస్తోంది.

Next Story