Fahad Fasil Look from Pushpa 2 : బన్వర్ సింగ్ షెకావత్ ఆటిట్యూడ్ అదిరిపోలే...

Fahad Fasil Look from Pushpa 2 : బన్వర్ సింగ్ షెకావత్ ఆటిట్యూడ్ అదిరిపోలే...
ఫాహద్ ఫాజిల్ బర్త్ డే సందర్భంగా 'పుష్ప 2' నుంచి పోస్టర్ రిలీజ్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న 'పుష్ప-2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై మేకర్స్ ఓ క్రేజీ అప్ డేట్ ను వదిలారు. ఈ రోజు(ఆగస్టు 8) నటుడు ఫాహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. 'పుష్ప 2'లో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించనున్న ఫాహద్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన 'పుష్ప పార్ట్ 1' ఎంతటి క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా రాబోతున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్.. అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక అప్పట్నుంచి ఈ మూవీపై ముందున్న అంచనాలు కాస్త మరింత రెట్టింపయ్యాయి. అప్పట్నుంచి మేకర్స్ రోజుకో అప్ డేట్ తో ప్రేక్షకులకు రోజురోజుకూ క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు. తాజాగా రివీల్ అయిన ఫాహద్ ఫాజిల్ పోస్టర్ సైతం ఆడియెన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ పోస్టర్ ను షేర్ చేసిన మైత్రి మూవీ మేకర్స్.. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బన్వర్ సింగ్ షెకావత్ సర్ మరోసారి వెండితెరపై అలరించనున్నాడంటూ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, టీ సిరీస్ లను ట్యాగ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఫాహద్.. సిగరెట్ తాగుతూ కళ్లకు గాగుళ్స్ తో ఆటిట్యూడ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పార్ట్ 2లోనూ ఆయన పాత్రకు పార్ట్ 1కంటే రెట్టింపు ఇంపార్టెన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇటీవలే ‘పుష్ప 2’ షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ షూట్ లో అల్లు అర్జున్‌ తో పాటు ఫహద్ ఫాజిల్, సునీల్ కూడా జాయిన్ అయినట్టు సమాచారం. వీరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్ లో సుకుమార్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఇక పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయట. అందుకే 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని పలువురు అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story