Fahadh Faasil : పుష్ప 2పై ఫహాద్ ఫాజిల్ చిన్న చూపెందుకు..?

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫహాద్ ఫాజిల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. అతనో ఇంటర్వ్యూలో రకరకాల విషయాలు పంచుకున్నాడు. తన ఫేవరెట్ మూవీస్, హీరోస్ తో పాటు రిటైర్మెంట్ తర్వాత బార్సిలోనా వెళ్లి ట్యాక్సీ నడుపుకుంటాను లాంటివి అందులో ఉన్నాయి. ఇంత వరకూ ఓకే. బట్ పుష్ప 2 గురించి మాత్రం చాలా చిన్న చూపుతో మాట్లాడాడు. తను ఆ సినిమా చేయడం ఓ మిస్టేక్ అని చెప్పడం గమనార్హం. అయితే సినిమా వచ్చిన ఇన్ని రోజులకు ఈ టాక్స్ ఎందుకు అని చాలామంది కౌంటర్స్ వేస్తున్నారు. తన సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. కమల్ హాసన్, రజినీకాంత్ లతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకున్నాడు. అదే టైమ్ లో ‘లాస్ట్ ఇయర్ నేనో మిస్టేక్ చేశాను. ఆ సినిమా పేరు కూడా చెప్పను. కానీ నా చేతిలో లేని విషయాల గురించి పట్టించుకోను’ అని చెప్పాడు ఫహాద్ ఫాజిల్. అయితే ఇదంతా పుష్ప 2 గురించే అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి పుష్ప 2 లో ఆడియన్స్ చూసిన కంటెంట్ కాదు ముందుగా అనుకున్నది. ఆ విషయం సెకండ్ పార్ట్ అనౌన్స్ అయిన తర్వాత విడుదల చేసిన ఓ వీడియో చూస్తే అర్థం అవుతుంది. పుష్పరాజ్ ను ఓ రాబిన్ హుడ్ రేంజ్ లో పరిచయం చేశాడు సుకుమార్. అలాగే సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ పాత్రలు ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ఉంటాయన్నారు. అందుకే ఫహాద్ ఈ పాత్రకు ఒప్పుకున్నాడు. మధ్యలో కథంతా మార్చేశాడు సుకుమార్. ఫహాద్ పాత్రను విలన్ గా మార్చాడు. అతను నీళ్లలో పడిపోయిన తర్వాత పుష్ప పాత్రతో ఆ స్విమ్మింగ్ పూల్ లో మూత్రం పోయించిన సీన్ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అందుకే ఫహాద్ ఈ పాత్ర చేయడం తన కెరీర్ లో ఓ తప్పిదం అని చెప్పాడేమో కానీ.. ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు అనేది చాలామంది చెబుతోన్న మాట.
ఇక ఈ సినిమాలో నటించాలని ఫహాద్ కు అతని వైఫ్ నజ్రియానే చెప్పిందని ఈ మూవీ ఇంటర్వ్యూస్ టైమ్ లో సుకుమార్ చెప్పిన వీడియోను కూడా బయటకు తీస్తున్నారు కొందరు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com