Allu Arjun : అల్లు అర్జున్ ను పట్టించుకోని ఫహాద్ ఫాజిల్

పుష్ప 1 ది రైజ్ కు సంబంధించి అప్పట్లో క్రేజీగా చెప్పుకున్నది మళయాల టాప్ స్టార్ ఫహాద్ ఫాజిల్ గురించే. అతను విలన్ గా నటిస్తున్నాడు అనే వార్త ప్రాజెక్ట్ కు మంచి హైప్ తెచ్చింది. భన్వర్ సింగ్ షెకావత్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ గా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. కానీ.. ఫహాద్ సెకండ్ హాఫ్ సగంలో ఎంట్రీ ఇవ్వడంతో ఆ పాత్రకు ఉన్న హైప్ తగ్గింది. బట్ ఈసారి అతనితోనే తలపడబోతున్నాడు కదా. అందుకే పుష్ప 2 ది రూల్ లో ఫహాద్ పాత్రకు చాలా ప్రాధన్యత ఉండబోతోంది. ఈ మేరకు అతను కూడా ప్రాజెక్ట్ కు హైప్ తీసుకురావాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకూ జరిగిన ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫహాద్ జాడే లేదు. పాట్నాలో కానీ, చెన్నైలో కానీ.. ఫహాద్ ఒక్కసారి కూడా కనిపించలేదు.
తాజాగా అల్లు అర్జున్ కేరళ ప్రమోషన్స్ కు వెళ్లాడు. అక్కడ ఐకన్ స్టార్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా. ఆ మేరకు అభిమానులు భారీగా తరలి వచ్చి అదే స్థాయిలో ర్యాలీ కూడా చేశారు. అయితే ఫహాద్ కేరళకు చెందిన వాడే కాబట్టి.. కనీసం అక్కడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా పాల్గొంటాడు అనుకున్నారు. బట్ ఫహాద్ లైట్ తీసుకున్నాడు. అక్కడ కూడా అల్లు హీరోకు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ తనే అతని గురించి మాట్లాడాడు. ‘బ్రదర్ ఫహాద్ నాతో కలిసి ఈ రోజున ఈ వేదిక మీద నాతో పాటు ఉంటాడు అనుకున్నాను. కానీ రాలేదు. అయినా సినిమాలో అద్భుతం చేశాడు. అతన్ని చూసి కేరళ అంతా గర్వపడుతుంది. ఆ స్థాయిలో నటించాడు’. అని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఫహాద్ ఇప్పటి వరకూ అసలు ప్రమోషన్స్ కు ఎందుకు రాలేదు అనేందుకు సరైన కారణాలేం కనిపించడం లేదు. కావాలని పుష్ప 2ను అవాయిడ్ చేస్తున్నాడా లేక.. ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. ఏదేమైనా ఫహాద్ లాంటి నటుడు ప్రమోషన్స్ లో ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే ఉండటంతో పాటు.. ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com