సినిమా

Lata Mangeshkar: ప్రముఖ బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్‌కు కరోనా..

Lata Mangeshkar: వయస్సును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించారు.

Lata Mangeshkar: ప్రముఖ బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్‌కు కరోనా..
X

Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 92 ఏళ్ల గాయని తన వయస్సును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించారు. నవంబర్ 2019లో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తరువాత కోలుకున్నారు.

భారతీయ సినిమాలోని గొప్ప నేపథ్య గాయకులలో ఒకరిగా పరిగణించబడుతున్న లతా మంగేష్కర్ 2001లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్నారు. లతా మంగేష్కర్ పద్మ భూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు.

Next Story

RELATED STORIES