Samantha: మీరు ప్రేమించినంతగా నన్ను మరెవరు ప్రేమించగలరు: సమంత

Samantha: మీరు ప్రేమించినంతగా నన్ను మరెవరు ప్రేమించగలరు: సమంత
Samantha: అన్నీ మనం అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎలా అవుతుంది.. ఎన్నో ఎదురుదెబ్బలు, అన్నింటినీ తట్టుకుని నిలబడాలి.

Samantha: అన్నీ మనం అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎలా అవుతుంది.. ఎన్నో ఎదురుదెబ్బలు, అన్నింటినీ తట్టుకుని నిలబడాలి. జీవితాంతం తోడు నిలబడతాడనుకున్న వ్యక్తి నాలుగేళ్లకే నీ దారి నువ్వు చూసుకో అంటే, అయిన వాళ్లందరూ ఆమెదే తప్పంటే అందరికీ సమాధానం చెప్పలేక, మానసిక వేదన అనుభవిస్తూ, కెమెరా ముందు నవ్వుతూ, సినిమానే నమ్ముకుని, సినిమానే శ్వాసిస్తున్న సమంతను తమ ఇన్‌స్పిరేషన్‌గా చూపిస్తుంటారు నటీ నటులతో పాటు నెటిజన్లు. అనారోగ్యం కూడా ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేసింది. అయినా సామ్ కోలుకుని మళ్లీ తెరమీదకు రావడానికి సిద్ధపడుతోంది.

ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా ట్విట్టర్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న సమంతకు తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ.. మీరు మళ్లీ ఎవరినైనా ప్రేమించొచ్చు కదా అంటే.. సమంత చాలా స్వీట్‌గా రిప్లై ఇచ్చింది. సామ్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ సామ్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. మీరు ప్రేమించినంతగా నన్ను మరెవరు ప్రేమించగలరు.. అంటూ లవ్ సింబల్ జత చేస్తూ ఇచ్చిన రిప్లై నెటిజన్ల మనసు గెలుచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story