Chiranjeevi : చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి

Chiranjeevi  :  చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి
X

మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీ చూస్తుండగా ఒక వ్యక్తి మరణించడం మాత్రం సంచలనం అయింది. అతను గుండెపోటు కారణంగా మరణించి ఉంటాడు అని భావిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని అర్జున్ థియేటర్ లో జరిగింది. అతను ఓ అభిమాని అయి ఉంటాడు అని అనుకుంటున్నారు. మరణానికి సరైన కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో పాటు మృతుడికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది.

ఇక సినిమా అయితే ఈ రోజు (12న) విడుదలైంది. అంతకు ముందు ఒక రోజు ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేస్తోంది. మొత్తంగా ఈ అభిమాని మరణం మాత్రం సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్ లో మరణించిన సందర్భాలు మాత్రం లేవు. చిరంజీవి సినిమా చూస్తూ అతను మరణించడం గుండెపోటు కారణం అని పోలీస్ లు మాత్రం అనుమానిస్తున్నారు.

Tags

Next Story