Mrunal Thakur: ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్.. క్యూట్ రిప్లై ఇచ్చిన మృణాల్

Mrunal Thakur: సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.. ఆ పాత్రకు ఆమెను తప్ప మరెవరినీ ఊహించుకోలేరు.. అంతగా ఇమిడిపోయింది సీతగా మృణాల్. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆచి తూచి అడుగేస్తోంది. తాజాగా నేచురల్ స్టార్ నానీ పక్కన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. యువకుల కలల రాణి అయిపోయిన మృణాల్‌కి ఓ అభిమాని ఇన్‌స్టాలో పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు.. నా సైడ్ నుంచి ఓకే.. అని రాసుకొచ్చాడు.. దానికి మృణాల్ క్యూట్ రిప్లై ఇచ్చింది. నా సైడ్ నుంచి ఓకే కాదు అని చెప్పింది.
మృణాల్ చివరిసారిగా సెల్ఫీ అనే హిందీ చిత్రంలో కనిపించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒరిజినల్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు పోషించిన పాత్రలను అక్షయ్, ఇమ్రాన్ పోషించారు. శల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com