Rashmika: ఆమె అందానికి అతడు ఫిదా.. 900 కి.మీ ప్రయాణించి..

Rashmika: ఆమె అందానికి అతడు ఫిదా.. 900 కి.మీ ప్రయాణించి..
తెరమీద తళుకులీనే తారల అందానికి తన్మయులవని హృదయాలుండవు.

Rashmika: ఇంకేం వద్దు.. ఈ జన్మకి ఇది చాలు.. ఆమెని చూస్తే నా మనసు ఆనంద పారవశ్యంలో మునిగిపోతుందని అనుకున్నాడు.. రష్మిక కోసం 900 కి.మీ ప్రయాణించాడు. తెరమీద తళుకులీనే తారల అందానికి తన్మయులవని హృదయాలుండవు. వారిని ఒక్కసారైనా నేరుగా చూసే అవకాశం వస్తే ఎంత బావుండు అని పరితపించి పోతుంటారు. తాజాగా తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే వ్యక్తి రష్మిక మండన్నకు వీరాభిమాని. ఆమెను చూడాలనుకున్నాడు.

గూగుల్‌లో ఆమె అడ్రస్ వెతికాడు. రష్మిక ఉండేది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు అనే గ్రామంలో ఉంటుందని తెలుసుకుని అక్కడికి పయనమయ్యాడు. కొంత దూరం నడిచాడు. ఇక నడిచే ఓపిక లేక ఆమెను చేరుకోవడానికి వివిధ రవాణా మార్గాలను ఉపయోగించాడు. రైలు మరియు ఇతర వాహనాలలో ప్రయాణిస్తూ త్రిపాఠి ఎలాగైతేనేం కొడగు ప్రదేశాన్ని చేరుకున్నాడు. కానీ అక్కడ లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయి. అయినా రష్మిక ముంబై షూటింగ్‌లో ఉన్నారని పోలీసులు అతడికి వివరించారు. దాంతో పాపం అతడు ఉసూరుమంటూ తిరుగు ప్రయాణమయ్యాడు. అభిమానం అతడిని అక్కడకు చేర్చింది.

రష్మిక బాలీవుడ్ మూవీ 'గుడ్‌బై' షూటింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. సిధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను అనే మరో హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉండగా జూలైలో అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పుష్ప చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story