Trisha Krishna : ఎంతో క్రేజ్ ఉన్న త్రిష ఇలాంటి పాత్రలోనా..?

Trisha Krishna :  ఎంతో క్రేజ్ ఉన్న త్రిష ఇలాంటి పాత్రలోనా..?
X

రెండున్నర దశాబ్దాలుగా తరగని అందంతో అలరిస్తోన్న బ్యూటీ త్రిష. హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో టాప్ ప్లేస్ ను దశాబ్దం పాటు రూల్ చేసింది. అప్పటి స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టర్స్ తోనూ యమా బిజీగా ఉండేది. నాలుగు పదుల వయసుకు వచ్చినా ఇప్పటికీ తన ఖాతాలో రెగ్యులర్ గా మూవీస్ ఉంటూనే ఉంటాయి. అదీ తన క్రేజ్, రేంజ్. అలాంటి రేంజ్ ఉన్న త్రిష తాజాగా వచ్చిన థగ్ లైఫ్ లో పోషించిన పాత్ర చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆఫర్స్ లేక, సినిమాల్లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనుకునే స్టేజ్ లో ఉండే హీరోయిన్లు కూడా చేయడానికి సంశయించే పాత్ర ఇది. సింపుల్ గా చెబితే ఓ వేశ్య పాత్ర. నిజానికి వేశ్య పాత్రల్లో నటించిన హీరోయిన్లంతా టాప్ ప్లేస్ కు వెళ్లారు. అవార్డులూ అందుకున్నారు. కానీ త్రిషకు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు దర్శకుడు మణిరత్నం.

ఒకప్పుడు నాయకుడు మూవీలో కూడా కమల్ హాసన్ ఓ వేశ్య వద్దకే వెళతాడు. కస్టమర్ ఉన్నా చదువుకుంటున్న ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమాలోనూ ఒక అమ్మాయిని వెదుకుతూ వెళ్లి.. వేశ్యా వాటికలో ఉన్న ఇంద్రాణిని ఇష్టపడి తన కీప్ గా ఉంచుకుంటాడు. అలాంటి చీప్ పాత్ర త్రిషది. అంటే పాత్రలో గొప్పదనం, ఎమోషన్స్, ఓ సంఘర్షణ ఇవన్నీ ఉంటే ఆ పాత్రా గొప్పగానే ఉండేది. కానీ అవేం లేకుండా ఓ చిన్న ఆర్టిస్ట్ చేసినా సరిపోయే పాత్రలో తను కనిపించడమే అభిమానులకు మింగుడు పడటం లేదు.

ఇంకా దారుణం ఏంటంటే.. కమల్ హాసన్ వద్ద చిన్నప్పటి నుంచి ‘కొడుకు’లా పెరిగిన శింబు పాత్ర.. కమల్ చనిపోయాడు అనుకుని ఇంద్రాణిని బలవంతంగా తను ఉంచుకోవడం.. ఓ రకంగా ఇండియన్ ఆడియన్స్ ఈ తరహా పాత్రలకు ఇంకా అలవాటు పడలేదు. హాలీవుడ్ లో అయితే పాస్ అయిపోయేది. కానీ కొన్ని విలువలు ఉన్న మనదేశంలో ఈ తరహా పాత్రను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అందుకే అలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న త్రిషను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

మొన్నటికి మొన్న ఇదే మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కుందావి పాత్రలో హుందాగా కనిపించిన త్రిషను వెంటనే ఇలాంటి పాత్రలో చూపించిన మణిరత్నంను కూడా తిట్టేసుకుంటున్నారు త్రిష ఫ్యాన్స్. ఏదేమైనా ఈ తరహా పాత్రల వల్ల ఈ ఏజ్ లో తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పాలి.

Tags

Next Story