RRR Movie : RRR మేకర్స్‌కి కొత్త తలనొప్పి.. ఫోన్‌లో కీలక సన్నివేశాలు షేర్..!

RRR Movie : ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. ఇంతవరకు భాగానే ఉంది కానీ.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'చిత్రబృందానికి అభిమానుల వల్ల కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. సినిమాను చూసిన ఫ్యాన్స్ కొన్ని సీన్లను ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో తెగ షేర్చేస్తున్నారు. దీంతో అవి వివిధ గ్రూపుల్లో వైరల్ కావడంతో చిత్ర బృందం అప్రమత్తమైంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సమయంలో కొందరు అభిమానులు అత్యుత్సాహంతో చేస్తున్న పని సమస్యలు తెచ్చిపెడుతోంది. టీమ్ పడిన శ్రమనంతటినీ వృథా చేస్తోంది. సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కీలక సన్నివేశాల్ని తమ ఫోన్లలో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిని చూసినవారంతా 'లైక్' కొట్టి, షేర్ చేస్తుండడం వల్ల నెట్టింట ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇదీ ఓ రకంగా పైరసీ కావడం వల్ల చిత్ర బృందం రంగంలోకి దిగింది. ప్రముఖ ఐటీ సంస్థతో కలిసి ఇలాంటి అనధికారిక పోస్ట్‌లన్నింటినీ తొలగిస్తోంది.
కొందరు అత్యుత్సాహంతో ముఖ్యమైన ఘట్టాల్ని సోషల్‌మీడియాలో పంచుకోవటం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలు చిత్రాల విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com