Dhanush_Aishawaryaa Divorce: వై దిస్ కొలవెరి.. ధనుష్‌కు ఏమైంది..

Dhanush_Aishawaryaa Divorce: వై దిస్ కొలవెరి.. ధనుష్‌కు ఏమైంది..
Dhanush_Aishawaryaa Divorce: సినిమాల్లోకి రాకముందు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా.. అతడిలో ఎన్నో కళలు దాగి ఉన్నాయి..

Dhanush_Aishawaryaa Divorce: విడాకులు అన్న పదం వినడానికే కష్టంగా ఉండేది ఒకప్పుడు.. ఇప్పుడేంటి ఇంత ఈజీ అయిపోయింది.. సర్థుకుపోవడమే సంసారం అని వివాహ జీవితంలోకి అడుగు పెట్టే ప్రతి జంటకీ తెలుసు.. అన్నీ తెలిసిన వారే మూడు ముళ్ల బంధాన్ని మూడు నిమిషాల్లో తెంపేసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరం పట్టొచ్చు.

ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ సంసారబంధాన్ని సాగనివ్వాలి.. పంతాలు పట్టింపులకు పోయి వివాహబంధానికి తిలోదకాలు ఇస్తున్నారు.. భార్యాభర్తల కోపతాపాలకు వారికి పుట్టిన చిన్నారులు బలవుతున్నారు.. ఎదుగుతున్న పిల్లలుతల్లిదండ్రులను చూసి ఏం నేర్చుకోవాలి. ఆదర్శంగా ఉండాల్సిన అమ్మానాన్నలు ఎవరి దారి వారు చూసుకుంటే వాళ్ల చిట్టి బుర్రలు ఎలా అర్థం చేసుకుంటారు.. నేర్పిన చదువు, తెలుసుకున్న విజ్ఞానం ఎందుకు పనికొస్తుంది.

స్వేచ్ఛ, స్వాతంత్రం వంటి పదాలు కొన్నింటికే వర్తిస్తాయి.. అన్నింటికీ కాదు అని ఎప్పటికి అర్థం చేసుకుంటారు. ఆర్థిక స్వాతంత్ర్యం అనురాగబంధాలను బీటలు వారుస్తుంది.. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే అయినా సమాజం వారిని సెలబ్రిటీలను చేసింది.. వారిని రోల్ మోడల్‌గా చూస్తారు.. కొందరికి ప్రేరణగా నిలుస్తారు.. అలాంటి వారు కూడా ఇలా.. ప్చ్.. బ్యాడ్‌లక్..

ధనుష్ .. కష్టపడి పైకి వచ్చిన హీరో.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ తాను నటించే ప్రతి చిత్రంలో ఏదో ఒక మెసేజ్‌ని ఆడియన్స్‌కి పాస్ చేస్తాడు.. అతడిని స్ఫూర్తిగా తీసుకున్న యువతకూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. తమిళ తలైవా రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకుని ఇద్దరు బిడ్డలు యాత్ర, లింగలకు తండ్రి కూడా అయ్యాడు.. తాజాగా తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఈ జంట ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

చూడడానికి ఓ మామూలు యువకుడిలా కనిపించే ధనుష్‌.. సినిమాల్లోకి రాకముందు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా.. అతడిలో ఎన్నో కళలు దాగి ఉన్నాయి.. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, గీత రచయిత, డ్యాన్సర్, గాయకుడు.. కంటెంట్ ఉండే కటౌట్ అక్కరలేదని ధనుష్ నటించిన చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

దాదాపు తాను నటించిన చిత్రాల్లో చాలా వరకు అవార్డ్ విన్నింగ్ చిత్రాలు కావడం విశేషం. 2011లో వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 3లో ఆయన పాడిన వై దిస్ కొలవెరి డి.. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ని దాటిన మొదటి భారతీయ సంగీత వీడియోగా నిలిచింది.

రజనీకాంత్ పెద్ద కూతురు కూడా ముందు ఒకరిని వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లి కూడా అయినా తరువా ఏవో మనస్పర్ధలు వచ్చి ఇద్దరూ విడిపోయారు.. మళ్లీ వివాహం చేసుకుంది.. ఇప్పుడు చిన్న కూతురు కూడా ధనుష్ నుంచి విడిపోవడం రజనీ అభిమానులకు మింగుడు పడని అంశం.. వారిద్దరి మధ్యలో ఏం ఉన్నాయో.. ఎందుకు విడిపోతున్నారో ఎవరికీ తెలియదు.. ఏదేమైనా తమ అభిమాన హీరో ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు సుతారమూ ఇష్టం ఉండదు.

ఫ్యాన్స్ తమ హీరోలను గుండెల్లో పెట్టుకుంటారు.. వారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తుంటారు. తమ కుటుంబంలోనే జరిగిన విషయంగా మదన పడుతుంటారు. ధనుష్ నుంచి మరిన్ని మంచి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ విషయమే అయినా మరో మంచి హిట్ పడితే మర్చిపోతారు.. మొన్నటికి మొన్న టాలీవుడ్‌లో చైతూ సామ్ విడిపోవడం.. ఇప్పుడు కోలీవుడ్‌లో ధనుష్, ఐశ్వర్య విడిపోవడం ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు.

Tags

Read MoreRead Less
Next Story