KGF2: కేజీఎఫ్ 2 కోసం వెయిటింగ్.. 'అనంత' ప్రశ్నలకు ఆన్సర్లు..

KGF2: కేజీఎఫ్ 2 కోసం వెయిటింగ్.. అనంత ప్రశ్నలకు ఆన్సర్లు..
X
KGF2: ఆ విషయంలో వంద శాతం సక్సెస్ అయ్యారు రాజమౌళి బాహుబలి ద్వారా. ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా అదే బజ్ ని క్రియేట్ చేసింది.

KGF2: పార్ట్ 1లో సస్పెన్స్ క్రియేట్ చేసి పార్ట్ 2 లో దానికి ఆన్సర్లు ఇవ్వడం ఇండస్ట్రీలో మామూలే.. అయితే ఆ సస్పెన్స్ కూడా ఆసక్తి దాయకంగా ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు.. ఆ విషయంలో వంద శాతం సక్సెస్ అయ్యారు రాజమౌళి బాహుబలి ద్వారా. ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా అదే బజ్ ని క్రియేట్ చేసింది.

యశ్ నటించిన కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. ఇప్పుడు ఏప్రిల్ 14న విడుదల కానున్న కేజీఎఫ్ 2ని కూడా హిట్ చేసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ లో కొన్ని ప్రశ్నలు.. సెకండ్ పార్ట్ లో వాటికి సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నారు సినీ ప్రియులు.

సినిమా మధ్యలో చనిపోయాడనుకున్న అధీరా చివర్లో ఎలా బయటకు వచ్చాడు.. ఇంతకాలం ఏమయ్యాడు..

రాఖీభాయ్ గతం ఏమిటి.. రాఖీ భాయ్ కి రమికా సేన్ కి ఉన్న వైరం ఏమిటి.. ఇలా ఎన్నో ప్రశ్నలు కేజీఎఫ్ ప్రియులను వెంటాడుతున్నాయి.

వీర ప్రతిమ దొరకనుందా

ఎల్లో రాడో సిటీ ఆఫ్ గోల్డ్ కేజీఎఫ్ కధ మొదలయ్యేది ఈ పుస్తకంతోనే. ఆనంద్ వాసిరాజు అనే రచయిత బంగారు గనుల సామ్రాజ్యం కోసం జరిగిన పోరాటాలను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకం రాస్తాడు. తరువాతి క్రమంలో ఈ పుస్తకాన్ని ప్రభుత్వం బ్యాన్ చేయడం, దానిలో ఏముంది అని తెలుసుకోవడానికి రచయితని ఓ మీడియా ఇంటర్వ్యూ చేయడంతో కథ మొదలవుతుంది. రచయిత తాను చెబుతున్న కథకు కోలార్ గనులకు దగ్గర్లో పాతిపెట్టి ఉన్న ప్రతిమ సాక్ష్యం అని చెబుతారు. అతడి మాటలతో మీడియా వాళ్లు ప్రతిమను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ ఆ ప్రతిమ దొరికిందా లేదా అనేది చాప్టర్ 2లో తెలుస్తుంది.

రాఖీబాయ్ గతమేంటి..

రామకృష్ణ పవన్ తల్లికి ఇచ్చిన మాటకోసం ముంబైలో అడుగుపెడతాడు. రాఖీబాయ్ గా ఎలా ఎదిగాడు.. అతడి గతం ఏంటి అనేది కేజీఎఫ్ 2లో తెలుస్తుంది.

అధీరా ఏమైపోయాడు..

గరుడతో జరిగిన అధికార పోరులో అధీరా చనిపోయినట్లు చూపించారు. కానీ చివర్లో అధీరా బతికే ఉన్నట్లు చివర్లో చూపించారు.. ఒకవేళ అధీరా బతికుంటే ఇంతకాలం ఏమైనట్లు. ఎక్కడికి వెళ్లినట్లు అనే విషయాలన్నీ చాప్టర్ 2లో తెలుస్తాయి.

వానరం.. ఏం చేస్తాడు..

గరుడకు నమ్మినబంటు వానరం. నరాచీకి సేనాధిపతిలాంటి వాడు. వానరం ఆజ్ఞాపిస్తే అతడి సైన్యం ఎలా స్పందించింది. నరాచీలో 20వేల మంది కార్మికులు వానర సైన్యానికి అడ్డుగా నిలబడ్డారా.

రమికా సేన్ వర్సెస్ రాఖీభాయ్..

నరాచీని హస్తగతం చేసుకోవడానికి ప్రముఖ పాత్రలన్నీ పోటీపడతాయని అర్ధమైంది కానీ సినిమా చివర్లోకి వచ్చేసరికి పొలిటికల్ డ్రామాగా కనిపించింది. అప్పటి వరకు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రమికా సేన్ గరుడ మరణ వార్త తెలిసి కేజీఎఫ్ ను హస్తగతం చేసుకోవడానికి ఏం చేసింది. ఎన్నో వేల మంది కార్మికుల గుండెల్లో దేవుడిగా పేరు తెచ్చుకున్న రాఖీ గొప్పతనాన్ని చెప్పే ఎల్లో రాడో పుస్తకాన్ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది.

కొత్త సందేహాలు..

కేజీఎప్ 2 కోసం వెయిటింగ్.. 'అనంత' ప్రశ్నలకు ఆన్సర్లు..కొన్ని కొత్త పాత్రలు చాప్టర్ 2 ట్రైలర్ లో కనిపించాయి. కథ చెప్పిన ఆనంద్ వాసిరాజు ఏమయ్యారు. మొదటి భాగంలో కనిపించని ఈశ్వరీ రావు పార్ట్లో కనిపించారు.. ఇందులో ఆమె పాత్ర ఏంటి.. రావు రమేశ్ పాత్ర ఏంటి అనే విషయాలన్నింటికీ కేజీఎఫ్ 2లో సమాధానాలు దొరకనున్నాయి.. ఫ్యాన్స్ మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Tags

Next Story