Pawan Kalyan: పవన్‌కు ఫ్యాన్స్ వార్నింగ్.. ఆ సినిమా చేస్తే ఆత్మహత్య

Pawan Kalyan: పవన్‌కు ఫ్యాన్స్ వార్నింగ్.. ఆ సినిమా చేస్తే ఆత్మహత్య
X
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ అంటే ఫ్యాన్స్ కు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. అలాంటి వారు ఇప్పుడు పవర్ స్టార్ కు వార్నింగ్ ఇస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ అంటే ఫ్యాన్స్ కు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. అలాంటి వారు ఇప్పుడు పవర్ స్టార్ కు వార్నింగ్ ఇస్తున్నారు. మా మాట వినకపోతే ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరిస్తున్నారు. ఇదేదో కొత్తగా ఉంది అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజం.



పవన్ కళ్యాణ్‌ కు వార్నింగ్ లు ఇస్తూ ఉత్తరాలు కూడా రాస్తున్నారు. ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ప్రభాస్ సినిమాకు కూడా జరిగింది. ఇప్పుడు పవర్ స్టార్ కు ఎదురవుతోంది. అయితే వారి బెదిరింపులు అన్నీ ఒక సినిమా చేయొద్దు అని. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ఎందుకు వద్దంటున్నారు..?


తెలుగులో రీమేక్ స్టార్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది వెంకటేష్‌.. తర్వాత పవన్ కళ్యాణ్‌. పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో మేజర్ హిట్స్ అన్నీ రీమేక్ లే ఉంటాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ కూడా రీమేక్ లే.



ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్‌. ఖుషీ ఫేమ్ ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న సినిమా ఇది. నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సమ్మర్ లో మార్చి 30న విడుదల కాబోతోన్న సినిమా ఇది.


దీంతో పాటు సుజిత్ డైరెక్షన్ లో రీసెంట్ గా ఓ కొత్త సినిమా అనౌన్స్ అయింది. అంతకు ముందే హరీశ్ శంకర్ తో సినిమా కమిట్ అయి ఉన్నాడు. అయితే హరీష్‌ అనుకున్న భవదీయుడు భగత్సింగ్ సినిమాను హోల్డ్ లో పెట్టేశాడు.



ఆ స్థానంలో తమిళ్ లో సూపర్ హిట్ అయిన తెరి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు పవన్. కానీ ఈ తెరి చిత్రం ఆల్రెడీ తెలుగులోనూ పోలీసోడుగా డబ్ అయింది. ఇక్కడా బానే ఆడింది. అలాంటి సినిమను మళ్లీ రీమేక్ చేయొద్దు అంటూ.. ఇప్పుడు అభిమానులు గొడవ మొదలుపెట్టారు.



పవన్ కళ్యాణ్‌ తో పాటు హరీష్‌ శంకర్ ను కూడా చేరుస్తూ వార్నింగ్ ల ఉత్తరాలు పంపుతున్నారు. ఒకమ్మాయి అయితే తెరి చిత్రాన్ని రీమేక్ చేస్తే తాను ఆత్మహత్యచేసుకుంటానంటూ బెదిరిస్తోంది. అంతకు ముందు ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ అప్డేట్స్ చెప్పడం లేదని అప్పట్లోనూ ఫ్యాన్స్ ఇలా సూసైడ్ చేసుకుంటాం అని బెదిరించారు.



మొత్తంగా పవన్ కళ్యాణ్‌ గతంలో కూడా వీరమ్ చిత్రాన్ని కాటమరాయుడుగా రీమేక్ చేసి లాస్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అది రిపీట్ కాకూడదు అని అభిమానులు గోల పెడుతున్నారు. మరి ప్రేక్షక దేవుళ్ల మాటను పవర్ స్టార్ మన్నిస్తాడో లేదో చూడాలి.

Tags

Next Story