Faria Abdullah : బుల్ బుల్ చిట్టికి బంపర్ ఆఫర్...!

Faria Abdullah : చిట్టి నా బుల్ బుల్ చిట్టి అంటూ యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది నటి ఫరియా అబ్దుల్లా.. తొలిసినిమా జాతిరత్నాలుతో హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఫరియా .. హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. ప్ర
స్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో, మంచు విష్ణు హీరోగా వస్తోన్న ఢీ సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలావుండగా ఇప్పుడు ఈ భామ బంపర్ ఆఫర్ కొట్టేసింది. నాగార్జున, నాగచైతన్య కలిసి మల్టీస్టారర్‌గా నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో ఫరియా అబ్దుల్లా క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట.
ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లుగా ఫిలింనగర్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు చిత్రం తెరకెక్కుతోంది.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూబ్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com