Faria Abdullah : జాతిరత్నం బ్యూటీలో ఈ యాంగిల్ కూడా ఉందట

జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ ఫారియా అబ్దుల్లా. తన హైట్ వల్ల ఎక్కువ అవకాశాలు రాలేదు కానీ.. వచ్చిన వాటిని బానే వాడుకుంటోంది. అమ్మడు అదిరిపోయే డ్యాన్సర్ అని అందరికీ తెలుసు. తను గతంలో ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ నే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. జాతిరత్నాలు తర్వాత కూడా తన స్టెప్పులు మైండ్ బ్లోయింగ్ అనేలా కొన్ని వీడియోస్ చూశాం. ప్రస్తుతం మత్తు వదలరా 2 అనే మూవీలో ఫీమేల్ లీడ్ గా నటించింది ఫారియా. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే తన పాత్రకు పెద్ద ప్రాధాన్యతే ఉన్నట్టు అర్థం అవుతోంది.అయితే టీజర్ లాంచింగ్ సందర్భంగా ఫారియా చెప్పిన మాట అందరినీ ఆకట్టుకుంటోంది.
మత్తు వదలరా 2 లో ఫారియా అబ్దుల్లా ఒక పాట రాసి తనే కంపోజ్ చేసి పాడటం కూడా తనే చేసిందట. మామూలుగా హీరోయిన్లలో ఈ టాలెంట్స్ అంటే సింగింగ్ వరకు చూస్తాం. కానీ రాసుకుని, కంపోజ్ చేసి పాడటం అంటే విశేషం అనే చెప్పాలి. అఫ్ కోర్స్ ఇన్ని చేసిన తనకు ఆ పాటకు స్టెప్పులు కంపోజ్ చేయడం పెద్ద కష్టమా. అది కూడా తనే చేసుకుందట. సో.. ఈ పాటతో తన కొత్త కెరీర్ ఆరంభం అవుతుందని చెప్పకనే చెప్పిందీ టాల్ బ్యూటీ.
అయితే ఆమె టాలెంట్ ఎంత ఉన్నా.. అది ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చిన హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థలను కూడా ఇక్కడ మెచ్చుకోవాలి. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం అంటే ఇది అని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com