Venu Swamy : వేణు స్వామిపై కేసు పెడతాం: ఫిల్మ్ జర్నలిస్టులు

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరంటూ జ్యోతిషుడు వేణు స్వామి జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA), తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) నిర్ణయించాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కించపరుస్తూ ఆన్‌లైన్‌లో కామెంట్స్ చేసేవారికి తమ చర్యలు అడ్డుకట్ట వేస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ ఎన్నికల రిజల్ట్ ముందు వేణు స్వామి పేరు మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేది. ఈయన చెప్పే జ్యోతిష్యానికి చాలా పేరు ఉండేది.కానీ ఎప్పుడైతే ఈయన చెప్పిన జ్యోతిష్యం ఏపీ ఎన్నికల్లో,తెలంగాణ ఎన్నికల్లో బోల్తా పడిందో అప్పటినుండి ఈయన కాస్త సైలెంట్ అయ్యారు. అయితే అనూహ్యంగా మళ్ళీ నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తో ఈయన జాతకం చెప్పడం మొదలుపెట్టారు.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలు బహిరంగంగా చెబుతూ వారి ప్రైవసీకి ఆటంకం కలిగిస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వేణు స్వామిపై కోలు కోలేని దెబ్బ కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది సెలబ్రెటీలు వేణు స్వామి జ్యోతిష్యం పై పిచ్చి కోపంగా ఉన్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటపెడుతూ వారి జీవితాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com